చిత్తూరు జిల్లా లోని ప్రముఖ క్షేత్రం కాణిపాకం. ఈ క్షేత్రంలో విఘ్నాలకు అధిపతి వినాయకుడు వరసిద్ధి వినాయకుడిగా పూజలను అందుకుంటున్నాడు. అయితే తాజాగా ఈ ఆలయంలో అభిషేకం టికెట్ ధరలు భారీగా పెరిగాయి. రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలతో స్వామివారి పంచామృతాభిషేకం టికెట్ ధరలను పెంచుతూ ఆలయాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలో పంచామృతాభిషేకం ధర 7 రెట్లు పెంచారు. ప్రస్తుతం పంచామృతాభిషేకం టికెట్ ధర రూ. 750లు ఉంది. అయితే ఇప్పుడు 7 రేట్లు పెరగడంతో.. రూ. 750 టికెట్ ధరను ఏకంగా రూ. 5000లకు చేరుకుంది.
అయితే వర సిద్ధి ఆలయంలో ఇప్పటి వరకూ ప్రతి రోజూ మూడుసార్లు పంచామృత అభిషేకం నిర్వహిస్తున్నారు. ఇక నుంచి ఈ సేవ భక్తులకు ఉదయం 5 నుంచి 6 గంటల వరకు కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రత్యేక అభిషేకానికి భారీగా టికెట్ ధరను నిర్ణయించింది దేవస్థానం. అయితే ఈ పంచామృతాభిషేకం ధర పెంపు పై అభిప్రాయాలను తెలిపేందుకు ఉభయదారులకు 15 రోజులు గడువు విదించింది. ఈ మేరకు ఒక నోటీసుని కూడా విడుదల చేసింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..