హిందూ ధర్మప్రచారంతో పాటు, శ్రీ శోభకృత్ నామ సంవత్సర భవానీ దీక్షకు సంబంధించిన ధర్మ ప్రచారం చేయడానికి ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మవారి ధర్మ ప్రచార రథాన్ని ప్రజలవద్దకు తీసుకుని వెళ్ళడానికి శ్రీకారం చుట్టింది. వైదిక కమిటీ ఆధ్వర్యంలో ఏపీలోని వివిధ గ్రామాల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించడానికి ఈ రోజు దుర్గామల్లేశ్వర స్వామి, అమ్మవార్లకు పూజలు చేసి ప్రచర రథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈఓ కె ఎస్ రామరావు తదితరులు పాల్గొన్నారు. రేపు (15.12.2023) నుంచి ఈ ప్రచారం రథం 24వ తేదీ వరకూ 10 రోజుల పాటు విజయవాడ నుంచి శ్రీకాకుళం జిల్లాలోని వివిధ గ్రామాల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఏ రోజు ఏ ఎయె ప్రాంతాల్లో అమ్మవారు పూజలను అందుకోనున్నారో పూర్తి వివరాలను తెల్సుకుందాం..
Route Map :
అయ్యా గ్రామములలోని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కావలసినదిగా చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వాహణాధికారి కె ఎస్ రామ రావు కోరారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..