Hanuman Jyanti: హనుమాన్‌ జయంతి వేళ అద్భుతం.. శివలింగంపై హనుమంతుడు రూపం ఆవిష్కృతం..

|

Apr 07, 2023 | 1:09 PM

శివుని అంశగా భావించే హనుమంతుడి జయంతి సందర్భంగా ఇక్కడి శివలింగాన్ని హనుమంతుని రూపంలో అలంకరించారు. శివలింగంపై రకరకాల పండ్లను ఉపయోగించి హనుమంతుని రూపాన్ని తీర్చిదిద్దారు.

Hanuman Jyanti: హనుమాన్‌ జయంతి వేళ అద్భుతం.. శివలింగంపై హనుమంతుడు రూపం ఆవిష్కృతం..
Hanuman On Shivlinga
Follow us on

దేశవ్యాప్తంగా హనుమాన్‌ జయంతి ఘనంగా ఉత్సవాలు జరిగాయి. అయితే మహారాష్ట్రలోని ఓ ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పూణెలోని పురాతన దేవాలయం ఘోరవాదేశ్వర్‌ దేలవాలయంలో అద్భుతం జరిగింది. ఆలయంలోని శివలింగంపై హనుమంతుని రూపాన్ని ఆవిష్కరించారు. పాత పూణె-ముంబై హైవేపై పాండవుల కాలంనాటి పురాతన దేవాలయం ఉంది. అదే ఘోరవాదేశ్వర్‌ ఆలయం. ఇక్కడ పరమేశ్వరుడు లింగరూపంలో పూజలందుకుంటున్నాడు. కాగా శివుని అంశగా భావించే హనుమంతుడి జయంతి సందర్భంగా ఇక్కడి శివలింగాన్ని హనుమంతుని రూపంలో అలంకరించారు.

శివలింగంపై రకరకాల పండ్లను ఉపయోగించి హనుమంతుని రూపాన్ని తీర్చిదిద్దారు. ఎర్రని దానిమ్మ గింజలతో శివలింగంపై కిరీటంలా తీర్చిదిద్దారు. రావి ఆకులపై శ్రీరామ నామం లిఖించి శివలింగం చుట్టూ అలంకరించారు. ఇటు హనుమంతుడికి, అటు శివునికి ఇష్టమైన జిల్లేడు ఆకులను కూడా సమర్పించారు. పసుపు, కెంపు, నీలం రంగు పూలతో పూజలు నిర్వహించారు. మావల్‌లోని ఘోరవాదేశ్వరాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం మొత్తం శ్రీరామనామ స్మరణతో మార్మోగింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..