janmashtami: హిందూమతంలో మహావిష్ణవు దశావతారాల్లో 8వ అవతారంగా శ్రీకృష్ణుడిని భావిస్తారు. శ్రీ కృష్ణుడి ఆరాధన అన్ని కష్టాలను తొలగించి, కోరిన కోర్కెలను తీరుస్తుందని భక్తుల విశ్వాసం. శ్రావణ కృష్ణపక్ష అష్టమి రోజున శ్రీకృష్టుడి జన్మాష్టమిగా జరుపుకొంటారు. ఈ పవిత్ర పండుగ సందర్భంగా దేశంలోని అన్ని దేవాలయాల్లో జన్మాష్టమి వేడుకలకు ముందుగానే సన్నాహాలు ప్రారంభమవుతాయి. దేశంలో ఎన్నో అద్భుతమైన శ్రీకృష్ణుని ఆలయాలు ఉన్నాయి. వాటిని చూసినప్పుడు, వాటి గురించి తెలుసుకున్నప్పుడు ప్రజలు ఆశ్చర్య పడతారు. అటువంటి గొప్ప , అద్భుతమైన కన్నయ్య దేవాలయాల గురించి ఈ రోజు వివరంగా తెలుసుకుందాం.
ఇక్కడ 9 రంధ్రాల కిటికీ ద్వారా శ్రీ కృష్ణుని దర్శనం:
దేశంలోని అన్ని ప్రసిద్ధ శ్రీకృష్ణుని ఆలయాల్లో కర్ణాటకలోని ఉడిపిలో ఉన్న ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. దక్షిణ భారతదేశంలోని మధురంగా ఈ కృష్ణుని పవిత్ర క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ఉడిపిలోని కృష్ణుని ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, ఆలయంలో నిర్మించిన తొమ్మిది రంధ్రాల కిటికీ నుంచి శ్రీకృష్ణుని దర్శనం చేసుకునే సంప్రదాయం ఉంది. ఈ రంధ్రాల ద్వారా కన్నయ్య దర్శించుకుంటే.. జీవితానికి సంబంధించిన అన్ని కోరికలు నెరవేరుతాయని ప్రజలు నమ్ముతారు.
100 కోట్ల విలువైన ఆభరణాలతో కన్నయ్యకు అలంకరణ:
పవిత్రమైన జన్మాష్టమి పర్వదినం రోజున ప్రతి కృష్ణ భక్తుడు.. ఇంటిలో దేవాలయాల్లో కృష్ణుడిని అలంకరిస్తారు. అయితే దేశంలో శ్రీకృష్ణుడు 100 కోట్ల విలువైన ఆభరణాలతో ఆలయం కూడా ఒకటి ఉంది. గ్వాలియర్‌లోని ఫుల్‌బాగ్‌లో ఉన్న శ్రీ కృష్ణ మందిరంలో ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఈ పవిత్రమైన జన్మాష్టమి రోజున విలువైన రత్నాలతో అలంకరించబడిన ఆభరణాలతో కృష్ణుడిని అలంకరిస్తారు. సింధియా రాజ కుటుంబానికి సంబంధించిన ఈ ఆభరణాలతో రాధాకృష్ణులను అలంకరిస్తారు. ఈ అలంకరణను.. ఆభరణాలను చూడడానికి ప్రతి సంవత్సరం ప్రజలు సుదూర ప్రాంతాల నుండి చేరుకుంటారు.
ప్రేమ మందిరం భక్తులను తనవైపు ఆకర్షిస్తుంది:
బంకే బిహారీతో పాటు, బృందావన్‌లో రాధాకృష్ణుల ప్రేమకు సంబంధించిన మరొక ఆలయం ఉంది. ఈ ఆలయం దీని గొప్పతనం తరచుగా భక్తుల మదిని తాకుతుంది. ప్రేమ మందిర అనే ఈ పవిత్ర ధామ్‌ను శ్రీ కృష్ణ భగవానుడి భక్తుడైన కృపా జి మహారాజ్ నిర్మించారు. పాలరాతితో చేసిన ఈ ఆలయంలోని అద్భుత శిల్పాలు.. పగలు ఒక విధంగా కనిపిస్తే.. రాత్రిపూట వివిధ రంగుల ప్రసరిస్తూ.. ఆ కాంతితో భక్తులను తనవైపుకు ఆకర్షిస్తుంది.
సంవత్సరానికి ఒకసారి మాత్రమే కనిపించే చరణ కమలం:
హిందూమతంలో.. శ్రీ కృష్ణ భగవానుని అన్ని రూపాలను ఆరాధించడం శుభఫలితాలను ఇస్తుందని భావిస్తారు. కృష్ణుడి పాద పద్మాల పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. కలియుగంలో కన్నయ్య పాదాల దర్శనం భక్తుల కోరికలను తీరుస్తుందని విశ్వాసం. అయితే బృందావన్‌లోని బాంకే బిహారీ ఆలయంలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే కనిపిస్తుంది. అది అక్షయ తృతీయ పండుగ నాడు మాత్రమే కన్నయ్య పాదపద్మాల దర్శన భాగ్యం కలుగుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకం పై ఆధారపడి ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)