
జగన్నాథ రథయాత్ర జూన్ 26 నుండి ప్రారంభం కానుంది. ఇది 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ యాత్రలో భారతదేశం నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ జగన్నాథ రథయాత్ర సమయంలో జగన్నాథుడు, తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి రథంపై ప్రయాణించి తమ అత్త ఇంటికి అంటే గుండిచా మందిరానికి చేరుకుంటాడు. 11వ రోజు జగన్నాథ స్వామి అన్న చెల్లెలతో కలిసి తన ఆలయానికి తిరిగి వస్తాడు.
జగన్నాథ రథయాత్ర ఎంత ప్రఖ్యాతి చెందిందో.. ఈ జగన్నాథ ఆలయం కూడా అంతే మర్మమైనది. పూరీ ఆలయానికి సంబంధించి ఇంకా పరిష్కారం కాని రహస్యాలు చాలా ఉన్నాయి. వీటిని ఇప్పటివరకు ఎవరూ కనుగొనలేకపోయారు. జగన్నాథ ఆలయంలోని ఒక రహస్యం ఏమిటంటే..పెళ్లికాని జంటలు ఆలయంలోకి ప్రవేశించడం నిషేధం. ఈ నియమానికి గల కారణాన్ని ఈ రోజు తెలుసుకుందాం.
పెళ్లికాని జంటలు పూరీ జగన్నాథ ఆలయాన్ని ఎందుకు సందర్శించకూడదు?
పెళ్లికాని జంటలను జగన్నాథ ఆలయంలోకి ఎందుకు అనుమతించకూడదనే నియమం వెనుక ఒక పౌరాణిక కథ ఉంది. ఇది రాధా రాణి శాపానికి సంబంధించినది. జగన్నాథ ఆలయంలో శ్రీకృష్ణుడు తన సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రుడితో కలిసి జగన్నాథుడి రూపంలో భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. అయితే ఇక్కడ రాధమ్మ కన్నయ్యతో లేదు. దీని వెనుక కూడా ఒక కారణం ఉంది.
ఒక పురాణం ప్రకారం ఒకసారి రాధా రాణి పూరి జగన్నాథ ఆలయానికి వచ్చి.. శ్రీ కృష్ణుడి జగన్నాథ దర్శించుకోవాలని.. సమస్త లోకానికి ప్రభువైన జగన్నాథుని రూపాన్ని చూడాలనే కోరికను వ్యక్తం చేసింది. రాధా రాణి పూరి ఆలయంలోకి అడుగుపెట్టగానే.. జగన్నాథ ఆలయ పూజారి రాధను లోపలికి వెళ్ళకుండా ఆపాడు. ఇలా ఎందుకు నన్ను లోపలి వెళ్ళనివ్వడం లేదని.. దీనికి కారణం ఏమిటని రాధా రాణి పూజారిని అడిగినప్పుడు.. పూజారి.. రాదా నువ్వు శ్రీ కృష్ణుడి ప్రేమికురాలివి అంతే.. వివాహిత స్త్రీ కాదు అని చెప్పాడు.
శ్రీ కృష్ణుడి భార్యలను ఆలయంలోకి అనుమతించనప్పుడు.. ఇక నేను మిమ్మల్ని మాత్రం ఆలయం లోపలికి ఎలా అనుమతించగలను అని చెప్పాడు పూజారి. దీంతో రాధా రాణికి చాలా కోపం వచ్చింది. అప్పుడు ఆమె జగన్నాథ ఆలయాన్ని శపించింది. ఇక నుంచి జగన్నాథుని దర్శనం కోసం పెళ్లికాని జంటలకు ఈ ఆలయంలోకి ప్రవేశించలేరని. జగన్నాథ ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించే ఏ పెళ్లికాని జంటకు ఆపై జీవితంలో తమ ప్రేమ దక్కదని శాపం పెట్టింది. అప్పటి నుంచి పూరి జగన్నాథ ఆలయంలో పెళ్ళికాని జంటలకు ప్రవేశం నిషేధించబడిందని చెబుతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.