Jagannatha Temple Puri: డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు పూరీ జగన్నాథ దేవాలయం మూసివేత.. ఎందుకంటే..

|

Dec 11, 2021 | 9:34 AM

Jagannatha Temple Puri: ఒడిశా రాష్ట్రం పూరిలోని జగన్నాథ దేవాలయం డిసెంబర్ 31 నుండి జనవరి 2 వరకు మూసివేయనున్నారు. ఈ నిర్ణీత రోజులలో భక్తులను అనుమతించడం

Jagannatha Temple Puri: డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు పూరీ జగన్నాథ దేవాలయం మూసివేత.. ఎందుకంటే..
Puri Jagannatha Temple
Follow us on

Jagannatha Temple Puri: ఒడిశా రాష్ట్రం పూరిలోని జగన్నాథ దేవాలయం డిసెంబర్ 31 నుండి జనవరి 2 వరకు మూసివేయనున్నారు. ఈ నిర్ణీత రోజులలో భక్తులను అనుమతించడం జరుగదని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. భక్తుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆలయానికి భక్తుల తాకిడీ పెరిగే అవకాశం ఉండటం, రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తి చెందే అవకాశాలు ఉండటంతో అలర్ట్ అయిన ఆలయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘నూతన సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని, కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకై.. డిసెంబర్ 31, 2021 నుంచి జనవరి 3, 2022 తేదీ వరకు పూరీ జగన్నాథ దేవాలయాన్ని మూసి వేయడం జరుగుతుంది. ఈ తేదీలలో భక్తులను ఆలయంలోకి అనుమతించడం జరుగదు. భక్తులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.’’ అని ఆలయ అధికారులు తమ ప్రకటనలో పేర్కొన్నారు.

Also read:

Nayanthara: మరో కొత్త వ్యాపారంలోకి లేడీ సూపర్‌ స్టార్‌.. బ్యూటీ బిజినెస్‌లో పెట్టుబడులు..

Semiconductor: సెమీకండక్టర్ అంటే ఏమిటి.. వాటి కొరత ఎందుకు వచ్చింది..?

Pushpa Item Song: యూట్యూబ్‎ను షేక్ చేస్తున్న సమంత ఐటెమ్ సాంగ్.. ఈ పాట పాడిన ఫోక్ సింగర్ ఎవరో తెలుసా..