AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC టూర్ ప్యాకేజీ: కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. 6 రోజుల ప్యాకేజీ ధర ఎంతంటే?

IRCTC Holy Uttar Pradesh tour Telugu: ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించాలనుకునే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ “Holy Uttar Pradesh” పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీలో పవిత్రమైన వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ క్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంటుంది. మొత్తం 5 రాత్రులు, 6 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది.

IRCTC టూర్ ప్యాకేజీ: కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. 6 రోజుల ప్యాకేజీ ధర ఎంతంటే?
Irctc Holy Uttar Pradesh Tour
Rajashekher G
|

Updated on: Aug 30, 2026 | 2:36 PM

Share

IRCTC Holy Uttar Pradesh tour Telugu: ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించాలనుకునే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ “Holy Uttar Pradesh” పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీలో పవిత్రమైన వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ క్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంటుంది. మొత్తం 5 రాత్రులు, 6 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది.

సికింద్రాబాద్ నుంచి ప్రారంభం

ఈ టూర్ ప్రతి ఆదివారం, శుక్రవారం అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 9:25 గంటలకు ట్రైన్ నంబర్ 12791 దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం ప్రారంభమవుతుంది. 3AC క్లాస్‌లో రైలు ప్రయాణం ఉంటుంది.

వారణాసి యాత్ర

రెండో రోజు మధ్యాహ్నం 1:25 గంటలకు వారణాసి చేరుకున్న తర్వాత హోటల్‌కు తీసుకెళ్తారు. అనంతరం కాశీ విశ్వనాథ ఆలయం, గంగా హారతి దర్శనం ఉంటుంది. మూడో రోజు కాశీ విశ్వనాథ మందిరం, కాలభైరవ మందిరం, బిర్లా మందిరం వంటి ఆలయాలను సందర్శించవచ్చు. షాపింగ్, వ్యక్తిగత కార్యక్రమాలకు కూడా కొంత సమయం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అయోధ్య, ప్రయాగ్‌రాజ్ సందర్శన

నాలుగో రోజు వారణాసి నుంచి సుమారు 220 కిలోమీటర్లు ప్రయాణించి అయోధ్య చేరుకుంటారు. అక్కడ అయోధ్య ఆలయం, హనుమాన్‌గఢి, దశరథ్ మహల్, సాయంత్రం సరయూ ఘాట్ సందర్శిస్తారు. ఐదో రోజు అయోధ్య నుంచి సుమారు 170 కిలోమీటర్లు ప్రయాణించి ప్రయాగ్‌రాజ్ చేరుకుంటారు. అక్కడ త్రివేణి సంగమం, అలోపీ దేవి ఆలయం దర్శనం అనంతరం రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఆరో రోజు రాత్రి 9:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు.

ప్యాకేజీ ధరలు

3AC కంఫర్ట్ ప్యాకేజీలో 1–3 మంది గ్రూప్‌కు ఒక్కొక్కరికి ట్విన్ షేరింగ్ ₹22,860, ట్రిపుల్ షేరింగ్ ₹18,170. 4–6 మంది గ్రూప్‌కు ఈ ధరలు వరుసగా ₹19,650, ₹16,930. పిల్లలకు బెడ్‌తో ₹15,260, బెడ్ లేకుండా ₹13,640గా ఉంది.

ప్యాకేజీలో రైలు ప్రయాణం, AC హోటల్ వసతి, షేరింగ్ ప్రాతిపదికన AC వాహనం, 3 బ్రేక్‌ఫాస్ట్‌లు, 3 డిన్నర్లు, ట్రావెల్ ఇన్సూరెన్స్, సందర్శనా ప్రదేశాల ప్రయాణం, పన్నులు ఉంటాయి. దర్శన టికెట్లు, గైడ్, రైల్లో ఆహారం, అదనపు వ్యక్తిగత ఖర్చులు ఇందులో ఉండవు.

ఐఆర్‌సీటీసీ హోలీ ఉత్తరప్రదేశ్ టూర్ ప్యాకేజీ బుకింగ్, పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వెండి, రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా? ఈ సింపుల్ చిట్కాలతో..
వెండి, రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా? ఈ సింపుల్ చిట్కాలతో..
భారత్ vs వెస్టిండీస్ పోరుకు రెడీ.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే..?
భారత్ vs వెస్టిండీస్ పోరుకు రెడీ.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే..?
2027 నాటికి బంగారం ధర రికార్డు స్థాయికి? షాకింగ్‌ నివేదిక
2027 నాటికి బంగారం ధర రికార్డు స్థాయికి? షాకింగ్‌ నివేదిక
ఇవి తింటే కంటి సైట్, మంట రాదు.. 24 గంటల్లోనే కళ్ల జోడుకు గుడ్ బై
ఇవి తింటే కంటి సైట్, మంట రాదు.. 24 గంటల్లోనే కళ్ల జోడుకు గుడ్ బై
రోహిత్ ఒక్కడే కాదా.. అగార్కర్ గుడ్‌బై చెప్పడానికి అసలు కారణం అతనే
రోహిత్ ఒక్కడే కాదా.. అగార్కర్ గుడ్‌బై చెప్పడానికి అసలు కారణం అతనే
ఉదయం టిఫిన్‌కి హెల్తీగా ఏదైనా కావాలా?జొన్న మెంతి పరాఠా చేసేయండి!
ఉదయం టిఫిన్‌కి హెల్తీగా ఏదైనా కావాలా?జొన్న మెంతి పరాఠా చేసేయండి!
వాడిన బట్టలు దానం చేస్తున్నారా? ఇలా చేస్తేనే మంచిదట..
వాడిన బట్టలు దానం చేస్తున్నారా? ఇలా చేస్తేనే మంచిదట..
నిద్రలేవగానే ఈ 3 తప్పులు చేయకండి.. వందేళ్లు బతుకుతారు!
నిద్రలేవగానే ఈ 3 తప్పులు చేయకండి.. వందేళ్లు బతుకుతారు!
విశాఖ సాగర తీరంలో సీఎం చంద్రబాబు విహారం..!
విశాఖ సాగర తీరంలో సీఎం చంద్రబాబు విహారం..!
రాత్రి ఆపిల్ తింటే పురుగులు చచ్చిపోతాయా? అసలు నిజం ఇదే!
రాత్రి ఆపిల్ తింటే పురుగులు చచ్చిపోతాయా? అసలు నిజం ఇదే!