Durga Temple: వివాదాలకు కేరాఫ్‌గా ఇంద్రకీలాద్రి.. ఈవోపై ఆలయ చైర్మన్‌ బహిరంగంగానే విమర్శలు..

|

May 06, 2023 | 6:50 AM

వరుస వివాదాలతో వార్తల్లో కెక్కుతున్న బెడవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మరో వివాదం చోటుచేసుకుంది. దుర్గగుడి ఈవో భ్రమరాంబ వ్యవహారంపై పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు బహిరంగంగానే విమర్శలకు దిగారు.

Durga Temple: వివాదాలకు కేరాఫ్‌గా ఇంద్రకీలాద్రి.. ఈవోపై ఆలయ చైర్మన్‌ బహిరంగంగానే విమర్శలు..
Kanaka Durga Temple
Follow us on

విజయవాడ దుర్గగుడిలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఈవో భ్రమరాంబ, పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు మధ్య వివాదం నడుస్తోంది. ఏసీబీకి పట్టుబడి అరెస్టయిన సూపరింటెండెంట్‌ నగేశ్‌ విషయంలో ఈవో బ్రమరాంబపైనా.. విచారణ జరగాలనే డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారు చైర్మన్‌. ఈవోపై మంత్రితోఉన్నతాధికారులకు కంప్లైంట్ చేస్తామని చైర్మన్‌ ప్రకటించడంతో దుర్గగుడి వివాదం ఆసక్తిగా మారుతోంది.

వరుస వివాదాలతో వార్తల్లో కెక్కుతున్న బెడవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మరో వివాదం చోటుచేసుకుంది. దుర్గగుడి ఈవో భ్రమరాంబ వ్యవహారంపై పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు బహిరంగంగానే విమర్శలకు దిగారు. దుర్గగుడి సూపరింటెండెంట్‌ వాసా నగేశ్‌ అవినీతి శృతి మించిపోయిందని.. లిఖితపూర్వకంగా ఈవోకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆరోపించారు. సూపరింటెండెంట్‌గా రెండు షిఫ్టుల్లో ఆయన్నే ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించినా పట్టించుకోలేదన్నారు.

అంతేకాదు.. ప్రస్తుతం ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ నగేశ్‌ విచారణ సమయంలో ఈవో బ్రమరాంబ దుర్గగుడిలో ఉండకూడదన్నారు ఛైర్మన్‌ రాంబాబు. కిందిస్థాయి సిబ్బందిని ఈవో బెదిరించే అవకాశాలు ఉన్నాయన్నారు.

ఇవి కూడా చదవండి

వాస్తవానికి.. నగేశ్‌ గతంలో ద్వారకాతిరుమలలో భారీగా అవినీతికి పాల్పడి దేవస్థానం ఆదాయానికి గండి కొట్టి దొరికారు. అప్పట్లో అతనిపై వేసిన విచారణకు అధికారిణిగా వ్యవహరించిన భ్రమరాంబకు అన్ని విషయాలు తెలిసినా దుర్గగుడిపై కీలక విభాగాల్లో నగేశ్‌నే నియమించారని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ద్వారకా తిరుమలలో టోల్గేట్ కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై దేవస్థానానికి సుమారు 17 లక్షల మేర నష్టం కలిగించారు. ఆ నిధులను నగేష్ జీతం నుండి రికవరీ కూడా చేస్తున్నారు. ఈ వ్యవహారమంతా దుర్గగుడి ఈవోకి తెలిసినా ఎందుకు అతనికి కీలక బాధ్యతలు కట్టబెట్టారో సమాధానం చెప్పాలని ఆలయ చైర్మన్ రాంబాబు డిమాండ్ చేశారు. అయితే.. చైర్మన్ బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నా.. ఈవో బ్రమరాంభ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో.. దుర్గుగుడి ఈవోపై చైర్మన్‌ చేసిన ఆరోపణలు.. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..