Independence Day: డిప్యూటీ సీఎం పవన్ ఇలాకాలో.. త్రివర్ణ పతాకాల అలంకరణతో దర్శనం ఇస్తున్న కన్నయ్య

కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఆ సేతు హిమాచలం 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ త్రివర్ణపతాకాన్ని ఎగరవేశారు. జాతి నుంచి ఉద్దేశించి ప్రసంగించారు. డిల్లీ నుంచి గల్లీ వరకూ త్రివర్ణ పతాక రెపరెపలాడుతున్నాయి.. దేశభక్తి గీతాలు ప్రతిధ్వనిస్తున్నాయి. మరోవైపు దేశ భక్తిని తమకు తోచిన రీతిలో ప్రదర్శిస్తున్నారు కొందరు. స్వాతంత్య దినోత్సవాన్ని పురష్కరించుకుని పిఠాపురంలోని కృష్ణయ్య ఆలయాన్ని త్రివర్ణ రంగులతో అలంకరించారు,

Independence Day: డిప్యూటీ సీఎం పవన్ ఇలాకాలో.. త్రివర్ణ పతాకాల అలంకరణతో దర్శనం ఇస్తున్న కన్నయ్య
Panduranga Temple

Updated on: Aug 15, 2025 | 12:54 PM

దేశ వ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభంగా జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వకార్యాలయాలు, పాఠశాలలు, ప్రధాన కూడళ్లలు ఇలా ప్రధాన ప్రాంతాల్లో మువ్వన్నెల జెండాని ఎగురవేశారు. జాతీయ జెండా అంబరాన్ని తాకుతూ రెపరెపలాడుతోంది. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్య సమరయోధులను స్మరిస్తూ.. ఘన నివాళులర్పిస్తున్నారు. ఈ స్వాతంత్య దినోత్సవ వేడుకలను దేవాలయాల్లో సైతం నిర్వహిస్తున్నారు. దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆలయాలను త్రివర్ణ పతాకాలతో అలంకరించి పూజలు నిర్వహిస్తున్నారు.

కాకినాడ జిల్లా పిఠాపురంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పిఠాపురంలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారిని జాతీయ జెండాలతో అర్చకులు అలంకరించారు. అర్చకులు విజయ జనార్ధనాచార్యులు ఆలయాన్ని జాతీయజెండాలతో అలంకరించారు. గర్భగుడిలో సైతం త్రివర్ణపతాకంతో అలంకరించడంతో జాతీయజెండా మరింత శోభాయమానంగా ప్రకాశిస్తోంది.

 

ఇవి కూడా చదవండి

దేశరక్షణకు నేనున్నానన్నట్టుగా శ్రీ వేణుగోపాలస్వామి దేవేరులతో కలిసి అభయమిస్తున్నట్టుగా ఉంది ఆ సుందర దృశ్యం. వినూత్నం అలంకారంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తరించారు భక్తులు. దైవభక్తితోపాటు తమ దేశభక్తిని చాటుకున్నారు. ప్రజలకు భక్తులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వినూత్నంగా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగించారు. ఆగస్టు 15 రోజున స్వామివారిని దర్శించుకోవడమే కాదు దేశభక్తిని కూడా చాటుకుంటున్నారు స్థానిక ప్రజలు..

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..