Spiritual Tips: ఇలా చేశారంటే.. మీ అప్పుల బాధలన్నీ పరార్ అవుతాయ్!

|

Feb 17, 2024 | 1:22 PM

మధ్య తరగతి కుటుంబం అయినా.. ధనవంతుల కుటుంబం అయినా.. ఎవరికైనా రుణ బాధలు అనేవి వెంటాడుతూనే ఉంటాయి. ఒక్కోసారి తెలియకుండానే అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉంటారు. అలాగే సడెన్‌గా అనుకోని ఖర్చు కూడా ఎదురవుతూ ఉంటుంది. కొన్ని సార్లు ఇంటి ఖర్చులకు కూడా సరిపడా డబ్బు లభ్యం కాదు. ఆ సమయంలో ఏం చేయాలో పాలుపోని స్థితిని కనిపిస్తుంది. అయితే ఇలాంటి రుణ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి..

Spiritual Tips: ఇలా చేశారంటే.. మీ అప్పుల బాధలన్నీ పరార్ అవుతాయ్!
Spiritual Tips
Follow us on

మధ్య తరగతి కుటుంబం అయినా.. ధనవంతుల కుటుంబం అయినా.. ఎవరికైనా రుణ బాధలు అనేవి వెంటాడుతూనే ఉంటాయి. ఒక్కోసారి తెలియకుండానే అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉంటారు. అలాగే సడెన్‌గా అనుకోని ఖర్చు కూడా ఎదురవుతూ ఉంటుంది. కొన్ని సార్లు ఇంటి ఖర్చులకు కూడా సరిపడా డబ్బు లభ్యం కాదు. ఆ సమయంలో ఏం చేయాలో పాలుపోని స్థితిని కనిపిస్తుంది. అయితే ఇలాంటి రుణ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి జ్యోతిష్య శాస్త్రంలే అనేక మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

హిందూ మంతలో వివిధ చెట్లకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. వేప, తులసి, బిల్వ పత్రి, బన్ని, మద్ది, రావి చెట్టులతో పాటు అర్జున చెట్టుకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. రుణ బాధలతో బాధ పడేవారికి విముక్తి కలగాలంటే.. అర్జును చెట్టు బాగా సహాయ పడుతుంది. రుణ సమస్యలను తగ్గించుకోవడానికి అర్జున చెట్టు బెరడుతో విముక్తి పొందవచ్చు.

రుణ విముక్తి కోసం అర్జున చెట్టు బెరడు ప్రయోజనాలు:

* రుణ విముక్తి కోసం.. అర్జున చెట్టు బెరడును ఎర్రటి గుడ్డలో చుట్టి ఇంట్లో పూజ గదిలో లక్ష్మీ దేవి దగ్గర పెట్టి.. పూజ చేయాలి. ఆ తర్వాత ఆ బెరడును.. నది నీటిలో వదిలేయాలి. ఇలా చేస్తే రుణ విముక్తి కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

* అర్జున చెట్టు బెరడుపై ఎర్ర చందనం చల్లాలి. ఆ తర్వాత ఎర్రటి గుడ్డలో చుట్టి.. అల్మారా లేదా లాకర్‌లో పెట్టుకోవాలి. ఇలా కూడా రుణ బాధల నుంచి విముక్తి పొందవచ్చు. అంతే కాకుండా ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరచుకోవచ్చు.

* అప్పుల బాధను దూరం చేసుకోవాలంటే ఈ చిట్కా కూడా బాగా సహాయ పడుతుంది. సాయంత్రం అర్జున చెట్టు బెరడు, కర్పూరం ముక్కను కలిపి ఇంటి బయట కాల్చాలి.

* అలాగే వ్యాపారంలో తరచూ నష్టాలు వస్తున్న వారు.. అర్జున చెట్టు బెరడును ఎర్రటి గుడ్డలో చుట్టి మెడలో కట్టుకోండి. దీని వల్ల మీ వ్యాపారంలో నష్టాలు తొలగి.. లాభాలు చేకూరతాయి. ఈ చిట్కా అద్బుతంగా పని చేస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడ్డాయి.