Vastu Tips: ఆ రెండు రోజుల్లో గ్యాస్ స్టౌ కొంటే కుటుంబంలో సమస్యలు కొని తెచ్చుకున్నట్లే.. శాస్త్రం ఏం చెబుతోందంటే..?

మనం సంతోషకరమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలంటే ఇంటి వాస్తు సరిగ్గా ఉండాలి. ఇంట్లో పడకగది, బాత్రూమ్, టాయిలెట్ ఇవన్నీ కూడా వాస్తు ప్రకారమే ఉండాలి.

Vastu Tips: ఆ రెండు రోజుల్లో గ్యాస్ స్టౌ కొంటే కుటుంబంలో సమస్యలు కొని తెచ్చుకున్నట్లే.. శాస్త్రం ఏం చెబుతోందంటే..?
Vastu Tips

Edited By:

Updated on: Mar 16, 2023 | 10:50 AM

మనం సంతోషకరమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని గడపాలంటే ఇంటి వాస్తు సరిగ్గా ఉండాలి. ఇంట్లో పడకగది, బాత్రూమ్, టాయిలెట్ ఇవన్నీ కూడా వాస్తు ప్రకారమే ఉండాలి. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, గ్యాస్ ఓవెన్ ఎక్కడ ఉంచాలో కూడా వాస్తు పండితుల చెప్పినట్లుగానే చేయాలి. వాస్తవానికి, మీరు ఏ పని మొదలు పెట్టినా వాస్తు ప్రకారం చేస్తే, ఆ ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. శాంతి, శ్రేయస్సు, ఆనందం నెలకొంటుంది.

ఇంటి అలంకరణ మాత్రమే కాకుండా ఇంట్లోకి కొత్త వస్తువులను కొనుగోలు చేసే విషయంలో కూడా వాస్తు చూడాల్సిందేనని శాస్త్రం చెబుతోంది. అందులో ముఖ్యమైనది గ్యాస్ స్టౌవ్. అవును గ్యాస్ స్టౌవ్ వాయుదేవుడితో పోల్చుతారు. అందుకే ఇంట్లో వంటగది సరైన దిశలో ఉండాలని చెబుతారు పండితులు. వంటిల్లుకు వాస్తు ఎంత ముఖ్యమో..వంటింట్లో ఉండే స్టౌవ్ కు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. అయితే కొన్ని వారాల్లో గ్యాస్ స్టౌవ్ కొనుగోలు చేయకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

గ్యాస్ స్టవ్ కొనడానికి మంచి రోజు:

ఇవి కూడా చదవండి

వాస్తు ప్రకారం, గ్యాస్ స్టవ్ శుభ దినాలలో కొనుగోలు చేయడం ఉత్తమం. ధన్‌తేరాస్ సాధారణంగా గ్యాస్ స్టవ్ కొనడానికి ఉత్తమమైన రోజు. అయితే ఇది కాకుండా మీరు గురువారం కూడా గ్యాస్ స్టవ్ కొనుగోలు చేయవచ్చు. గురువారం ప్రభువు బృహస్పతి. కాబట్టి ఈ రోజు కొన్ని వస్తువులను కొనుగోలు చేయడానికి చాలా అనుకూలమైనది.

బుధవారం గ్యాస్ స్టౌ కొనుగోలు చేయకూడదు:

శాస్త్రం ప్రకారం, బుధవారం నాడు గ్యాస్ ఓవెన్ లేదా స్టవ్ కొనకూడదు. అంతే కాదు, బుధవారం నాడు ఎటువంటి మండే పదార్థాలు లేదా వస్తువులను కొనుగోలు చేయవద్దు. ఇది కాకుండా, శనివారం కూడా గ్యాస్ ఓవెన్‌లను కొనడం మానుకోండి. శనివారం రోజున మండే పదార్థాలను కొనుగోలు చేయడం వల్ల కుటుంబంలో సమస్యలు నెలకొంటాయని శాస్త్రం చెబుతోంది.

గ్యాస్ స్టవ్ ఎక్కడ పెట్టాలి:

1. వాస్తు శాస్త్రం ప్రకారం, వంటగదికి ఆగ్నేయం వైపు గ్యాస్ పొయ్యికి అత్యంత అనుకూలమైన ప్రదేశం.

2. నైరుతి రాహువు దిశగా పరిగణిస్తారు. ఈ దిక్కున గ్యాస్ స్టవ్ పెడితే కుటుంబ సంబంధాల్లో చీలికలు ఏర్పడతాయి.

3. గ్యాస్ స్టవ్ పశ్చిమం లేదా నైరుతి దిశలో ఉంచినట్లయితే, మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.

4. అయితే గ్యాస్ స్టవ్ వాయువ్య దిశలో ఉంచడం మంచిది. ఈ దిశలో వేడి ఉంటే అది వ్యక్తి అభివృద్ధి శిఖరాగ్రానికి చేరుకోవడానికి సహాయపడుతుంది.

Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..