God In Dreams: దేవుడు కలలో కనిపిస్తే ఏమవుతుంది.? ఏ దేవుడు దేనికి సంకేతం.!

మనం తరచూ కలలు కంటుంటాం. చాలామందికి నిత్యం తమ జీవితాల్లో జరిగే విషయాలు, అంశాలు కలల్లో కనిపిస్తుంటాయి. అయితే మీకు ఎప్పుడైనా..

God In Dreams: దేవుడు కలలో కనిపిస్తే ఏమవుతుంది.? ఏ దేవుడు దేనికి సంకేతం.!
God In Dreams
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Oct 26, 2021 | 7:31 PM

మనం తరచూ కలలు కంటుంటాం. చాలామందికి నిత్యం తమ జీవితాల్లో జరిగే విషయాలు, అంశాలు కలల్లో కనిపిస్తుంటాయి. అయితే మీకు ఎప్పుడైనా కలలో దేవుడు కనిపించాడా.? ఒకవేళ మీ కలలో దేవుడు కనిపిస్తే ఏం జరుగుతుంది.? దేవుడు కలలో కనిపిస్తే.. దేనికి సంకేతం.? స్వప్న శాస్త్రం ప్రకారం.. ప్రతీ కలకు ఓ అర్ధం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో, మీరు కలలో దేవుడిని చూస్తే.. దానికి ప్రత్యేకమైన సంకేతం ఉంటుంది. కలలో ఏ దేవుడు కనిపిస్తే.. ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..

దుర్గామాత కోపంగా కనిపిస్తే..

మీ కలలో దుర్గామాతను కోపంగా చూసినట్లయితే, ఆ కల అశుభ పరిణామానికి సంకేతం. అంటే ఆ తల్లి మీపై కోపంగా ఉందని అర్థం. ఒకవేళ దుర్గామాత సింహంపై స్వారీ చేసినట్లు మీకు కలలో కనిపిస్తే.. మీ జీవితంలో సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని అర్ధం.

శివుడిని కలలో చూస్తే..

మీ కలలో శివుడిని చూసినట్లయితే, మీరు సమస్యల నుంచి అతి త్వరలో విముక్తి పొందనున్నట్లు అని అర్ధం. శివుడు కలలోకి వచ్చాడంటే.. అన్ని ఇబ్బందులు తొలిగినట్లే. అంతేకాకుండా మీ కలలో శివలింగాన్ని చూసినట్లయితే, ఆ కల కూడా ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. మీ జీవితంలో పురోగతి, కీర్తిని పొందుతారని.. దాని సంకేతం.

రాముడిని కలలో చూస్తే..

మీరు కలలో రాముడిని చూస్తే.. చాలా శుభప్రదం. మీ జీవితంలో పురోగతికి అవకాశాలు లభిస్తాయని అర్థం. అయితే అందుకు మీ విధులను మీరు సక్రమంగా నిర్వర్తించాలని ఆ కల సంకేతం.

కలలో శ్రీకృష్ణుని దర్శనం..

మీకు కలలో శ్రీకృష్ణుడు కనిపిస్తే.. స్నేహం, లేదా మరేదైనా బంధం ద్వారా మీ జీవితంలో ప్రేమ చిగురిస్తుందని దాని అర్ధం. ఒకవేళ మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉంటే.. ఈ కల చాలా పవిత్రమైనది అని అంటారు.

కలలో విష్ణువు దర్శనం..

మీ కలలో విష్ణువును చూసినట్లయితే, మీరు విజయం సాధిస్తారని.. జీవితంలో పురోగతిని పొందుతారని అంటారు.

లక్ష్మీదేవి కలలో కనిపిస్తే..

మీ కలలో లక్ష్మీదేవి కమలంపై కూర్చున్నట్లు కనిపిస్తే, అది చాలా పవిత్రమైన కలగా పరిగణిస్తారు. ఈ కల సంపదకు చిహ్నం. కలలో లక్ష్మీమాతను చూస్తే.. మీకు డబ్బు త్వరలోనే లభిస్తుందని.. లాభాలను పొందుతారని అంటారు.

Read Also: ఆ ఒక్క కారణమే.. సమంతకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది..!! అందుకే అలా చేసింది.

డాగ్జిల్లా Vs కాంగ్.. కర్ర తీసుకుని కుక్కను కొట్టిన కోతి.. క్రేజీ వీడియో నెట్టింట వైరల్!

రోజూ భార్యతో గొడవలు.. చివరికి భర్త ఏం పని చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

వార్నర్, విలియమ్సన్, నబీ మెగా ఆక్షన్‌లోకి.! వచ్చే ఏడాది మారనున్న సన్‌రైజర్స్ జట్టు..