భక్తి పలు రకాలుగా ఉంటుంది. తమకు ఇష్టమైన దేవుళ్లను భక్తితో ఆరాధిస్తుంటారు. కానుకలను కూడా సమర్పిస్తుంటారు. అయితే ఓ భక్తుడు మాత్రం తన కళా నైపుణ్యంతో అద్భుతమైన తయారు చేసిన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి కానుకగా ఇచ్చాడు. ఆ భక్తుడు ఎవరు..? ఆ భక్తుడిచ్చిన కానుక ఏంటి..? తెలుసుకుందాం..
హైదరాబాద్ కు చెందిన సూరం సంపత్ కుమార్ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి భక్తుడు. చిన్నప్పటినుంచి ప్రతిభ పాటవాలు కలిగిన సంపత్ కుమార్ బొమ్మలు తయారు చేస్తుండే వాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కోట్లాది రూపాయలతో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని పునర్ నిర్మించింది. స్వామివారి ఆలయాన్ని ఉద్ఘాటన తర్వాత సంపత్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నాడు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, కృష్ణ శిలలతో ఆలయ కళా నైపుణ్యాన్ని చూసి అబ్బురపడ్డాడు.
యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని చాక్ పీస్ లతో తయారు చేయాలని సంపత్ కుమార్ సంకల్పించాడు. దీంతో 8 వేల చాక్ పీసులతో మూడు నెలలపాటు తన కళా నైపుణ్యంతో శ్రమించి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నమోనాను తయారు చేశాడు. యాదాద్రి ఆలయంలోని అష్టభుజి ప్రాకార మండపం, వేంచేపు, కళ్యాణ మండపాలు, క్యూ లైన్లు, ఆలయ గోపురాలు, మాడవీధులు, రిటర్నింగ్ వాల్ ను చాక్ పీసులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాడు.
కృష్ణశిలతో పునః నిర్మితమైన యాదాద్రి పంచ నారసింహుల మహా దివ్యాలయాన్ని చాక్‌పీస్ లతో రూపొందించిన శిల్పి సూరం సంపత్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ నమూనాను ఆలయ ఈవో గీతారెడ్డికి అప్పగించారు. ఆలయ ఈవో అర్చకులు శిల్పి సంపత్ కుమార్ ను సన్మానించి లడ్డు ప్రసాదం అందించారు.
మా ఇంటి ఇలవేల్పు లక్ష్మీ నరసింహ స్వామిని ఉద్ఘాటన తర్వాత దర్శించుకుని ఆలయ నమూనాను తయారు చేయాలని సంకల్పించాలని సంపత్ కుమార్ చెప్పాడు. కళా నైపుణ్యంతో స్వామివారి ఆలయ నమొనాను తయారు చేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..