Khairatabad Ganesh: ఈ సారి 50 అడుగుల మట్టి గణనాథుడు.. ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం.. 

|

Jun 11, 2022 | 8:37 AM

ఖైరతాబాద్.. ఈ పేరు వినగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది భారీ గణనాథుడు. దేశ వ్యాప్తంగా ఖైరతాబాద్ వినాయకుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తాజాగా, ఈసారి గణేశ్ ఉత్సవాలపై కీలక నిర్ణయం తీసుకుంది ఉత్సవ కమిటీ.

Khairatabad Ganesh: ఈ సారి 50 అడుగుల మట్టి గణనాథుడు.. ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం.. 
Khairatabad Ganesh
Follow us on

Khairatabad Ganesh: వినాయకచవితి అనగానే రాష్ట్ర ప్రజలకు గుర్తొచ్చేది హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేషుడు. ప్రతి ఏడాది భిన్నమైన రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఆకట్టుకునే ఆ మహాగణపతి, ఈ ఏడాది కూడా భక్తులను అనుగ్రహించేందుకు సిద్ధం అవుతున్నాడు. తాజాగా, ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర, మహా గణనాథుడి విగ్రహ నిర్మాణ పనులను ఉత్సవ కమిటీ సభ్యులు కర్ర పూజతో ప్రారంభించారు. నిర్జల ఏకాదశిని పురస్కరించుకుని మహాగణపతికి కర్రపూజ నిర్వహించినట్టు చెప్పారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు. అటు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈసారి ఖైరతాబాద్ మహాగణపతిని మట్టితో తయారు చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఈ ఏడాది 50 అడుగుల ఎత్తులో కొలువుదీరనున్నాడు ఈ ఖైరతాబాద్ మహాగణపతి. పంచముఖ లక్ష్మీ గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు గణపయ్య.

మట్టి విగ్రహాలనే వాడాలని గత ఏడాది ఉత్సవాల సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలతోనే ఈసారి మట్టి గణపయ్యను తయారుచేస్తున్నట్టు వెల్లడించింది, ఉత్సవ కమిటీ. మట్టి విగ్రహం ఎత్తు 50 అడుగుల మేర ఉండనుంది. అయితే, ఎక్కడ నిమజ్జనం చేయాలన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈనెల 24న హైకోర్టులో వినాయక విగ్రహాల తయారీపై విచారణ ఉంది. ఆ రోజు వచ్చే తీర్పును బట్టి ఎక్కడ నిమజ్జనం అనేదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అటు, తమపై ఎవరి ఒత్తిడి లేదని, పోలీసులు కర్రపూజ, ఉత్సవాల నిర్వహణపై మాత్రమే మాట్లారని స్పష్టం చేసింది గణేశ్‌ ఉత్సవ కమిటీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..