Tirumala: తిరుమల శ్రీవారికి భారీ బంగారు కానుక.. ఎన్ని కోట్ల విలువైందో తెలిస్తే..

5.267 కేజీల బంగారంతో వ‌జ్రాలు, ర‌త్నాల‌తో పొదిగిన‌ క‌ఠి, వ‌ర‌ద హ‌స్తాల‌ను స్వామివారికి స‌మ‌ర్పించారు. తిరుమ‌ల‌లోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో టీటీడీ అద‌న‌పు ఈవో సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రికి ఆభ‌ర‌ణాల‌ను సంజీవ్ గోయెంకా అందచేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంతో పాటు బొక్కసం ఇంచార్జ్ గురురాజ స్వామి పాల్గొన్నారు.

Tirumala: తిరుమల శ్రీవారికి భారీ బంగారు కానుక.. ఎన్ని కోట్ల విలువైందో తెలిస్తే..
Sanjiv Goenka Gold Ornament

Edited By: Jyothi Gadda

Updated on: May 16, 2025 | 9:41 PM

తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. వెలకట్టలేని బంగారు వజ్ర వైడూర్యాల ఆభరణాలు వెంకన్న సొంతం. భక్తులు మొక్కు లో భాగంగా సమర్పించే కానుకలు కూడా ఎంతో ఖరీదైనది గా ఉంటున్నాయి. ఇలా వెంకన్నకు చేరుతున్న కానుకలు, విరాళంగా సమర్పిస్తున్న ఆభరణాలు రూ. కోట్లాది విలువైనవి ఉంటున్నాయి. రోజూ శ్రీవారిని దర్శించుకునే వేలాదిమంది భక్తులు సమర్పించే కానుకలు కూడా కోట్లాది రూపాయల విలువైనవిగా ఉంటున్నాయి. టీటీడీ ఖాతా కు అందుతున్న సొమ్ము, స్వామి వారి బొక్కసం కు చేకూరుతున్న ఆభరణాలు కళ్ళు మిరిమిట్లు గొలిపేలా ఉంటున్నాయి. ఇందులో భాగంగా శ్రీ‌వారికి బంగారు క‌ఠి, వ‌ర‌ద హ‌స్తాలు విరాళం అందింది. కలక‌త్తాకు చెందిన సంజీవ్ గోయెంకా అనే పారిశ్రామికవేత్త భారీ బంగారు కానుక విరాళంగా అందించారు.

రూ.3.63కోట్లు విలువైన 5.267 కేజీల బంగారంతో వ‌జ్రాలు, ర‌త్నాల‌తో పొదిగిన‌ క‌ఠి, వ‌ర‌ద హ‌స్తాల‌ను స్వామివారికి స‌మ‌ర్పించారు.
తిరుమ‌ల‌లోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో టీటీడీ అద‌న‌పు ఈవో సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రికి ఆభ‌ర‌ణాల‌ను సంజీవ్ గోయెంకా అందచేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంతో పాటు బొక్కసం ఇంచార్జ్ గురురాజ స్వామి పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..