Tirumala Rush: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. దర్శనం కోసం బారులు తీరిన భక్తులు.. కొండపై 1.50 లక్షల మంది ఉన్నారని అంచనా

|

May 29, 2022 | 11:18 AM

శనివారం నుంచి రెండు కిలోమీటర్లకు పైగానే భక్తుల క్యూలైన్ లో దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఇక్కడికే తిరుమల గిరిపై దాదాపు 1.50 లక్షల మంది భక్తులు ఉన్నట్లు టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.

Tirumala Rush: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. దర్శనం కోసం బారులు తీరిన భక్తులు.. కొండపై 1.50 లక్షల మంది ఉన్నారని అంచనా
Tirumala Devotees Rush
Follow us on

Tirumala Rush: తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి వారి భక్తులకు అలెర్ట్.. తిరుమల క్షేత్రంలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. గతంలో ఎన్నడూ లేనంతగా తిరుమల క్షేత్రానికి భక్తులు వస్తున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. స్వామివారి దర్శనం కోసం అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీతో శ్రీవారి దర్శన సమయాల్లో గందరగోళం ఏర్పడింది. భక్తుల దర్శన సమయంలో ఒక్కొక్కరిదీ ఒక్కోమాట అంటూ భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి దర్శనానికి 48 గంటలు పడుతుందని టీటీడీ ఈఓ ప్రకటన చేయగా.. ఈరోజు(ఆదివారం) ఉదయం 16 గంటల సమయం పడుతుందని టీటీడీ చైర్మన్ మరో ప్రకటన చేశారు.. ఇక మరోవైపు దర్శన సమయం పది గంటలేనని టీటీడీ బులిటెన్ లో పేర్కొంది. దీంతో స్వామివారి దర్శన సమయం విషయంలో విరుద్ధమైన ప్రకటనతో గందరగోళం ఏర్పడింది.

మరోవైపు శనివారం నుంచి రెండు కిలోమీటర్లకు పైగానే  భక్తుల క్యూలైన్ లో దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఇక్కడికే తిరుమల గిరిపై దాదాపు 1.50 లక్షల మంది భక్తులు ఉన్నట్లు టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. క్యూ లైన్ లో వేచి చూస్తున్న భక్తులందరికీ అన్న ప్రసాదాలు, మజ్జిగ, నీళ్లు అందజేస్తున్నారు.

ఇక భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకోవడంతో వాహనాల రద్దీ నెలకొంది. గంటకు 4.5 వేల మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. 35వేల మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఇప్పటికే ఆన్ లైన్ స్లాటెడ్ దర్శన టికెట్లు పొంది ఉన్నారు. స్లాటెడ్ దర్శనాలతో సర్వదర్శనం భక్తులకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు  వసతి గదులు కోసం భక్తుల పడిగాపులుకాయాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి

తిరుమలలో అధికంగా భక్తుల రద్దీ ఉన్న నేపథ్యంలో స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు అన్ని ముందస్తులు చర్యలు తీసుకుని రావాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు ఓపికగా  ఉండాలని కోరారు. అంతేకాని తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు రావద్దని టీటీడీ ఎప్పుడూ చెప్పలేదన్నారు వైవి సుబ్బారెడ్డి. భక్తుల రద్దీ అధికంగా ఉందని, వారికి దర్శనం అయ్యే వరకు ఓపికగా వేచి ఉండేలా ఏర్పాట్లు చేసుకుని రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

వేసవి సెలవులు కావడంతో భక్తులు అనూహ్య సంఖ్యలో తిరుమలకు తరలి వస్తున్నారని చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా దాదాపు రెండేళ్ళ పాటు చాలామంది భక్తులు తిరుమలకు రాలేక పోయారన్నారు. భక్తులకు అవసరమైన ఆహారం, నీరు అందించేందుకు ఏర్పాటు చేశామన్నారు. అధికారులు, ఉద్యోగులు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారని వైవి సుబ్బారెడ్డి అభినందించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..