Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. కొనసాగుతున్న రద్దీ.. స్వామివారి దర్శనానికి 9 గంటల సమయం..

|

Jul 06, 2022 | 1:27 PM

శ్రీవారి భక్తులకు అలెర్ట్.. తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు

Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. కొనసాగుతున్న రద్దీ.. స్వామివారి దర్శనానికి 9 గంటల సమయం..
Tirumala Devotees Rush
Follow us on

Tirumala: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి(sri venkateswara swami) కొలువైన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి (Tirumala Tirupati).  కలియుగ వైకుంఠం గా కీర్తిగాంచిన తిరుమలలోని శ్రీ వెంటకనాథుడిని దర్శించుకుని.. తమ మొక్కులను చెల్లించుకోవడానికి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని భక్తులతో పాటు.. దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు.  ఈ నేపథ్యంలో తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం చేసుకునే భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 9 గంటలకు పైగా సమయం పడుతుంది.

స్వామిని వారిని మంగళవారం జులై 5వ తేదీన 73,439 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 34,490మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక స్వామివారికి హుండీ ద్వారా భక్తులు స్వామివారికి నిన్న ఒక్క రోజే సమ్పర్పించిన కానుక విలువ 4.35 కోట్ల రూపాయలని టీటీడీ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..