
ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజుని హోలీ పండగగా జరుపుకుంటారు. ఈ హోలీ హోలీ హిందూ మతంలో ఒక ప్రధాన పండుగ. హోలీ పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా భావిస్తారు. దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. హోలీ రోజున ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు పూసుకుని ఆలింగనం చేసుకుంటారు. హోలీ రోజున వాస్తు శాస్త్రంలో కొన్ని నివారణలు కూడా సూచించబడ్డాయి. ఈ పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది. అదే విధంగా ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. కనుక హోలీ రోజున చేయాల్సిన చర్యల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి తిధి మార్చి 13న ఉదయం 10:35 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి మార్చి 4న మధ్యాహ్నం 12:23 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో హోలికా దహనం మార్చి 13న చేయనున్నారు. మార్చి 14న హోలీ పండుగ జరుపుకోనున్నారు.
లక్ష్మీ దేవి తులసి మొక్కలో నివసిస్తుందని నమ్ముతారు. అందువల్ల హిందూ మతంలో తులసి మొక్కకి చాలా ముఖ్యమైనది స్థానం ఉంది. హోలీ రోజున తులసి మొక్కను నాటాలి. వాస్తు శాస్త్రం ప్రకారం హోలీ రోజున తులసి మొక్కను నాటడం వల్ల లక్ష్మీ దేవి ఆశీస్సులు లభిస్తాయి. లక్ష్మీ దేవి అనుగ్రహం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి. ఈ రోజున తులసి మొక్కను నాటడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం హోలీ రోజున, ఇల్లు లేదా ఆఫీసులో తూర్పు దిశలో ఉదయించే సూర్యుని చిత్రాన్ని ఉంచాలి. ఇలా చేయడం వలన వ్యక్తి జీవితంలో అదృష్టం కలుగుతుంది. ఇలా చేయడం ద్వారా వ్యాపారంలో పురోభివృద్ధి కలుగుతుంది. అంతేకాదు ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది.
హోలీ రోజున ఇంటికి వెండి నాణెం లేదా వెండి వస్తువులు తీసుకుని రండి. తర్వాత ఆ వెండి నాణెంను లక్ష్మీ దేవి ముందు ఉంచి పూజించాలి. అప్పుడు వెండి నాణెం మీ పర్సులో లేదా డబ్బులు పెట్టే సేఫ్‌లో ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
హోలీ రోజున బెడ్ రూమ్ లో శ్రీ కృష్ణుడు రాధా ఫోటోని ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో ఆనందం కలుగుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు