Telugu News Spiritual Hanuman Puja Tips: Taking These Measures On Tuesday All The Troubles Are Believed To Be Removed
Hanuman Puja Tips: మంగళవారం హనుమాన్ ని ఇలా పూజించండి.. ఆహారానికి, ఆదాయానికి లోటు ఉండదు..
మంగళవారం భక్తితో బజరంగబలిని పూజిస్తారో... వారిపై వాయుపుత్రుడైన హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయని, హనుమంతుడు తన కష్టాలన్నింటినీ తొలగిస్తాడని విశ్వాసం. బజరంగబలి అనుగ్రహం పొందడానికి ప్రజలు మంగళవారం ఉపవాసం ఉండడానికి కారణం ఇదే. మంగళవారం రోజున చేపట్టిన ప్రత్యేక చర్యలతో హనుమంతుడు సంతోషించి భక్తులకు తన ఆశీస్సులు అందిస్తాడని నమ్మకం. అంతేకాదు కోరిన కోరికలు తీరుస్తాడు.
హిందూ మతంలో ప్రతి రోజు వేర్వేరు ప్రాముఖ్యత ఇవ్వబడింది. ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకి అంకితం చేయబడింది. మంగళవారం హనుమంతుడికి, అంగారక గ్రహానికి అంకితం చేయబడింది. ఎవరు మంగళవారం భక్తితో బజరంగబలిని పూజిస్తారో… వారిపై వాయుపుత్రుడైన హనుమంతుని ఆశీస్సులు లభిస్తాయని, హనుమంతుడు తన కష్టాలన్నింటినీ తొలగిస్తాడని విశ్వాసం. బజరంగబలి అనుగ్రహం పొందడానికి ప్రజలు మంగళవారం ఉపవాసం ఉండడానికి కారణం ఇదే. మంగళవారం రోజున చేపట్టిన ప్రత్యేక చర్యలతో హనుమంతుడు సంతోషించి భక్తులకు తన ఆశీస్సులు అందిస్తాడని నమ్మకం. అంతేకాదు కోరిన కోరికలు తీరుస్తాడు. దీంతో పాటు మంగళవారం చేపట్టిన చర్యలతో భక్తులు రాజయోగాన్ని కూడా పొందుతారు. ఈ నేపథ్యంలో హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం తీసుకోవాల్సిన చర్యల గురించి తెలుసుకుందాం…
బజరంగబలి ఆశీస్సుల కోసం మంగళవారం పాటించాల్సిన రెమెడీస్
మంగళవారం హనుమంతుడి ఆలయానికి వెళ్లి రామ నామాన్ని జపించండి. రామ నామాన్ని జపించడం వల్ల హనుమంతుడు సంతోషిస్తాడు. జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాలను తొలగిస్తాడు.
మంగళవారం నాడు రామరక్షా స్త్రోత్రాన్ని పఠించి, మిఠాయిని హనుమంతుడికి నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేయడం వలన వాయు కుమారుడైన హనుమంతుని అనుగ్రహం కూడా లభిస్తుంది.
వీలైతే మంగళవారం ఉపవాసం ఉండండి. అలాగే ఈ రోజు పేదలకు ఆహారం అందించండి. ఇలా చేయడం వల్ల హనుమంతుని అనుగ్రహంతో డబ్బుకు, ఆహారానికి ఎప్పటికీ కొరత ఉండదని విశ్వాసం.
హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం రోజున హనుమంతుడికి శనగలను సమర్పించండి. ఈ రోజున సుందరకాండ పఠించండి. ఇలా చేయడం వల్ల బజరంగబలి ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం.
మంగళవారం హనుమంతుడికి బెల్లం సమర్పించండి. ఈ పూజ ముగిసిన అనంతరం ఆవుకు బెల్లం తినిపించండి. ఇలా చేయడం వల్ల జీవితంలో తిండికి, డబ్బుకు లోటు ఉండదని నమ్ముతారు.