Hanuman Jayanti: ఈ ఏడాది హనుమాన్ జయంతిని ఎప్పుడు, ఏ తేదీన జరుపుకోవాలి? పూజా విధానం మీకోసం

|

Apr 01, 2023 | 10:30 AM

ఈ ఏడాది ఏప్రిల్ 05, 2023 ఉదయం 09:19 నుండి ఏప్రిల్ 06, 2023 వరకు ఉదయం 10:04 గంటలకు పౌర్ణమి ఘడియలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో.. ఉదయ తిథిని ప్రాతిపదికగా పరిగణించి ఏప్రిల్ 06, 2023న హనుమాన్ జన్మదినాన్ని జరుపుకోనున్నారు. 

Hanuman Jayanti: ఈ ఏడాది హనుమాన్ జయంతిని ఎప్పుడు, ఏ తేదీన జరుపుకోవాలి? పూజా విధానం మీకోసం
Hanuman Jayanti 2023
Follow us on

హిందూమతంలో.. వాయుపుత్రుడైన హనుమంతుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆంజనేయస్వామిని పూజించడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. హనుమాన్ ను పూజించడానికి మంగళవారం, శనివారాలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ రెండు రోజులు మాత్రమే కాదు.. హనుమాన్ జయంతిని అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి పండుగను 06 ఏప్రిల్ 2023 న జరుపుకుంటారు. ఈరోజు హనుమంతుడి పూజకు సంబంధించిన శుభ సమయం, పద్ధతి, మతపరమైన ప్రాముఖ్యతను గురించి వివరంగా తెలుసుకుందాం.

హనుమంతుడి జయంతి పూజకు అనుకూలమైన సమయం
పంచాంగం ప్రకారం.. ఈ సంవత్సరం హనుమంతుడి జయంతి పండుగను 06 ఏప్రిల్ 2023 న జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం, అంజనేయ స్వామి పుట్టినరోజు చైత్ర మాసం పౌర్ణమిన జరుపుకోనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 05, 2023 ఉదయం 09:19 నుండి ఏప్రిల్ 06, 2023 వరకు ఉదయం 10:04 గంటలకు పౌర్ణమి ఘడియలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో.. ఉదయ తిథిని ప్రాతిపదికగా పరిగణించి ఏప్రిల్ 06, 2023న హనుమాన్ జన్మదినాన్ని జరుపుకోనున్నారు.

హనుమంతుడి జయంతి పూజ విధి
హనుమంతుడి జయంతి పూజ కోసం ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ధ్యానం చేయాలి. అనంతరం పూజా స్థలంలో ఒక పోస్ట్‌పై ఎర్రటి వస్త్రాన్ని పరచి హనుమంతుడి విగ్రహాన్ని, చిత్రాన్ని మొదట గంగాజల్‌తో శుభ్రపరచాలి. అనంతరం పూజ కోసం ఎరుపు రంగు పువ్వులు, కుంకుమ, గంధం, అక్షత, మోతీచూర్ లడ్డూలు లేదా బూందీ మొదలైనవాటిని సమర్పించాలి. అనంతరం హనుమాన్  చాలీసాను ఏడుసార్లు పఠించండి. నైవేద్యం సమర్పించే సమయంలో తులసిని తప్పనిసరిగా సమర్పించాలి. హనుమాన్ జయంతి రోజున సాధకుడు ఉపవాస దీక్షను పాటించాలి. బ్రహ్మచర్యంతో ఉండి పూజించాలి.

హనుమాన్ జయంతి ఆరాధన ప్రాముఖ్యత
పురాణాల కథనం ప్రకారం హనుమంతుడు చిరంజీవి. అతను ప్రతి యుగంలో భూమిపై ఉంటాడనే విశ్వాసం. తనను భక్తిశ్రద్దలతో పూజించే భక్తుల సహాయార్ధం పరిగెత్తుకు వస్తాడని విశ్వాసం. సనాతన సంప్రదాయంలో, చిరంజీవిగా పిలువబడే హనుమంతుని ఆరాధన చాలా పవిత్రమైనది. చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. హనుమంతుడిని పూజించే వ్యక్తి ఎప్పుడూ పొరపాటున కూడా కష్టాల బారిన పడడు. అంతేకాదు శత్రువుల నుండి రక్షించబడి సురక్షితంగా ఉంటాడని నమ్మకం.

మరిన్ని ఆధాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)