Hanuman Chalisa: హనుమాన్ చాలీసాలో తప్పులున్నాయా? ఆ నాలుగు పదాల అర్థం సరికాదా? తులసీ పీఠాధిపతి చెప్తున్నదేంటి?

|

Apr 07, 2023 | 8:16 AM

హనుమాన్‌ చాలీసా వింటే సకల శుభాలు కలుగుతాయంటారు. హనుమాన్‌ చాలీసా విన్నా, చదివినా ఎంతో పుణ్యమంటారు. చాలా ఇళ్లల్లో హనుమాన్‌ చాలీసా వినిపిస్తూ ఉంటుంది. అయితే.. హనుమాన్‌ చాలీసాలో నాలుగు తప్పులున్నాయని.. తులసీ పీఠాధిపతి, జగద్గురువులు రామభద్రాచార్య చెబుతున్నారు.

Hanuman Chalisa: హనుమాన్ చాలీసాలో తప్పులున్నాయా? ఆ నాలుగు పదాల అర్థం సరికాదా? తులసీ పీఠాధిపతి చెప్తున్నదేంటి?
Acharya Rambhadracharya
Follow us on

హనుమాన్‌ చాలీసా వింటే సకల శుభాలు కలుగుతాయంటారు. హనుమాన్‌ చాలీసా విన్నా, చదివినా ఎంతో పుణ్యమంటారు. చాలా ఇళ్లల్లో హనుమాన్‌ చాలీసా వినిపిస్తూ ఉంటుంది. అయితే.. హనుమాన్‌ చాలీసాలో నాలుగు తప్పులున్నాయని.. తులసీ పీఠాధిపతి, జగద్గురువులు రామభద్రాచార్య చెబుతున్నారు. ఎక్కడెక్కడ తప్పులున్నాయో.. వాటిని ఎలా సరిచేయాలో కూడా ఆయన చెప్పారు.

ప్రతి ఒక్కరూ పవన్‌పుత్ర హనుమాన్‌ను ఆరాధిస్తారు.. హనుమాన్ చాలీసాను కూడా పఠిస్తారు. ప్రతి ఇంట్లో హనుమాన్‌చాలీసా వింటూనే ఉంటారు. అయితే, తులసీ పీఠాధిపతి, జగద్గురువులు రామభద్రాచార్య.. హనుమాన్‌ చాలీసాలో నాలుగు తప్పులున్నాయంటున్నారు. వాస్తవానికి రామభద్రాచార్య హనుమాన్‌ భక్తులు. నిరంతరం హనుమాన్‌ పారాయణంలోనే గడుపుతుంటారు. అయితే, హనుమాన్ చాలీసాలోని ఒక చరణంలో శంకర్ సువన్ కేసరి నందన్ అని ఉంది. ఇందులో లోపం ఉందట.. దానికి బదులు శంకర్ స్వయం కేసరి నందన్ అయి ఉండాలి. దీనికి కారణం హనుమాన్ జీ శంకర్ జీ కొడుకు కాదు, ఆయన సొంత రూపమని రామభద్రాచార్య చెబుతున్నారు.

27వ అధ్యాయంలో కూడా తప్పుందట..

హనుమాన్ చాలీసాలోని 27వ అధ్యాయంలో ఏముందంటే.. సబ్‌ పర్‌ రామ్‌ తపస్వి రాజా అని ఉంది. అయితే ఇందులో.. సబ్‌ పర్‌ రామ్‌రాజ్‌ సిర్‌ తాజా అని ఉండాలి. ఒక్క పదం తేడాతో చాలీసా అర్థమే మారిపోయిందని జగద్గురువులు కోప్పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

అలాగే 32 వ శ్లోకంలో రామ్ రసయన్ తుమ్హారే పాసా, సదా రహో రఘుపతికే దాసా అనే చరణంలో తప్పుందంటున్నారు. రామ్‌ రసయాన్‌ తుమ్హారే పాసా, సాదర్‌ హో రఘుపతి కే దాస్‌.. అంటే.. ఎప్పుడూ రఘుపతి సేవకుడిగా ఉండు అనే అర్థం వచ్చేలా ఉండాలని రామభద్రాచార్య చెబుతున్నారు.

హనుమాన్‌ చాలీసాలోని 38 వ అధ్యాయంలో తప్పు..

చాలీసాలోని 38వ అధ్యాయంలో ‘జో సత్‌ బార్‌ పాఠ్‌ కర్‌ కోయీ’ అని రాశారు. అంటే.. ఎవరైతే వంద సార్లు హనుమాన్ చాలీసాను పఠిస్తారో అన్న దాంట్లో తప్పుందంటున్నారు గురువులు. ఇందులో సరైన పదం.. ‘యహ్‌ సత్‌ బార్‌ పాఠ్ కర్‌ జోహీ’ అనేది సరైందని రామభద్రాచార్య అభిప్రాయం.

హనుమాన్‌ చాలీసాలో తప్పులున్నాయని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ హనుమాన్‌ చాలీసా ఎవరు రాశారు.. ఎప్పుడు రాశారో తెలుసా..

16వ శతాబ్ధంలో హనుమాన్‌ చాలీసా రాసినట్లు ప్రసిద్ధి..

16వ శతాబ్ధంలో అక్బర్‌ హయాంలో తులసీదాస్‌ హనుమాన్‌ చాలీసా రాసినట్లు చరిత్ర చెబుతోంది. ఒకరోజు ఆగ్రాలో ఆగిన తులసీదాస్‌ను చూడాలని రమ్మన్నాడు అక్బర్‌. చక్రవర్తి పిలిచినా రాకపోయేసరికి తులసీదాస్‌ను గొలుసులతో బంధించి చెరసాలలో పెట్టారు. అప్పుడు తులసీ దాస్‌ శ్రీరాముడు, హనుమంతుడిని స్మరిస్తూ రాసినదే హనుమాన్‌ చాలీసా అని అనేక గ్రంథాలు చెబుతున్నాయి. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్లు హనుమాన్‌ చాలీసాను పఠిస్తే.. వాళ్ల కష్టాలన్నీ తీరిపోతాయని హనుమాన్ చాలీసా చెబుతోంది. అయితే ఇందులో తప్పులున్నాయంటూ ఇప్పుడు తులసీ పీఠాధిపతి ప్రస్తావించడంతో.. హనుమాన్‌ చాలీసా గురించి చర్చ మొదలైంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..