Srisiddeswara Temple: స్వయంభు శ్రీసిద్దేశ్వరాలయంలో అద్భుతం.. ఏడాదిలో మూడు రోజులే ఆ అదృష్టం..!

| Edited By: Balaraju Goud

Sep 14, 2024 | 7:38 PM

మాటలకే అంతుచిక్కని విచిత్రం ఈ సూర్యకిరణాల మిస్టరీ.. చుట్టూ నాలుగు వైపులా పెద్ద పెద్ద గుట్టలు. పడమటి ముఖద్వారం కలిగిన ఈ శివాలయంలో నేరుగా గర్భగుడిలోని శివలింగంపై వాలుతున్న సూర్య కిరణాలు ఆ స్వయంభు శివలింగానికి పునఃశక్తిని ప్రసాదిస్తున్నాయి.

Srisiddeswara Temple: స్వయంభు శ్రీసిద్దేశ్వరాలయంలో అద్భుతం.. ఏడాదిలో మూడు రోజులే ఆ అదృష్టం..!
Srisiddeswara Temple
Follow us on

ఆ వింత మహత్యమా..! లేక ఆలయ నిర్మాణంలో నైపణ్యమో..? ఏమో కానీ.. సూర్యకిరణాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఓ వింత ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఏడాదిలో కేవలం మూడు రోజులు మాత్రమే గర్భగుడిలోని శివలింగంపై పడే కిరణాలు, పరమ శివుడి మహాత్యంగా బావిస్తున్నారు. గర్భగుడిలో సర్వదర్శనం మరో విశిష్టత.. అసలు ఆ సూర్య కిరణాలు కేవలం వినాయక నవరాత్రి ఉత్సవాల సమయంలో మాత్రమే ఎలా శివలింగంపై పడుతున్నాయి..? చుట్టూ గుట్టలు, నాలుగు ప్రధాన ద్వారాలను దాటి లింగంపై సూర్యకిరణాలు పడడం ఎలా సాధ్యం..? మిస్టరీగా మారిన ఆ సన్ మిరాకిల్ గురించి తెలుసుకుందాం..!

మాటలకే అంతుచిక్కని విచిత్రం ఈ సూర్యకిరణాల మిస్టరీ.. చుట్టూ నాలుగు వైపులా పెద్ద పెద్ద గుట్టలు. పడమటి ముఖద్వారం కలిగిన ఈ శివాలయంలో నేరుగా గర్భగుడిలోని శివలింగంపై వాలుతున్న సూర్య కిరణాలు ఆ స్వయంభు శివలింగానికి పునఃశక్తిని ప్రసాదిస్తున్నాయి.. అది కూడా కేవలం ఏడాదిలో మూడు రోజులు మాత్రమే సూర్యకిరణాలు శివుని స్పర్శించి భక్తులను పులకరించి పోయేలా చేస్తున్నాయి.

1100 సంవత్సరాల క్రితం హనుమకొండలో వెలసిన స్వయంభూ సిద్దేశ్వరాలయంలో ఈ విచిత్రం భక్తులను ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. ఈ ఆలయానికి ముందు భాగంలో నంది మండపం ఉంటుంది. దానికి ముందు ప్రధాన ద్వారం ఎంట్రెన్స్ ఆర్చి ఉంటుంది. దానికి ముందు పద్మాక్షి గుట్టపై దేవాలయం ఉంటుంది. ఆలయానికి కుడి వైపున హనుమత్‌గిరి కొండ. ఎడమవైపున కాలభైరవ కొండా, వెనుక వైపు లక్ష్మీ నరసింహస్వామి గుట్ట, ముందు వైపు పద్మాక్షి దేవాలయం గుట్ట ఉంటాయి.

ఎటుచూసినా నాలుగు వైపులా గుట్టలు.. పైగా పడమటి ముఖద్వారం కలిగిన ఈ ఆలయంలోకి ఏ కోశాన సూర్యకిరణాలు పడే అవకాశం లేదు. మూడు ప్రధాన ద్వారాలు పూర్తిగా కిందికి ఉంటాయి. ఆలయం లోపలికి వెళ్లే భక్తులు కూడా ఆ ద్వారాలు వద్ద తలకు తాకకుండా కిందికి వంగి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఆలయం ముందు భాగంలో నంది మండపం ఉండడం వల్ల ఎట్టి పరిస్థితులను సూర్య కిరణాలు గర్భగుడిలో పడే అవకాశమే లేదు.

కానీ ప్రతిఏటా భాద్రపద మాసంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరిగే సమయంలో మాత్రమే ఈ విచిత్రం వెలుగు చూస్తుంది. సూర్యాస్తమయ సమయంలో సాయంత్రం 5:55 గంటల నుండి 6 గంటల మధ్య అంటే ఐదు నిమిషాల పాటు సూర్య కిరణాలు నేరుగా శివలింగం పై పడి ఈ స్వయంభు శివలింగానికి పునఃశక్తిని ప్రసాదిస్తున్నాయి. కేవలం మూడు రోజులు మాత్రమే శివలింగంపై సూర్యకిరణాలు పడడం కచ్చితంగా పరమేశ్వరుడి మహత్యమే అని భక్తులు భావిస్తున్నారు. సూర్య దర్శనం అనంతరం నాగు పాము వచ్చి శివలింగం చుట్టు ప్రదక్షిణలు చేసి శివుడికి మొక్కు చెల్లించుకోవడం మరో ప్రత్యేకత..!

వీడియో చూడండి…

అసలు ఈ ఆలయం విశిష్టతలేంటి..? కేవలం మూడు రోజులు మాత్రమే సూర్యకిరణాలు గర్భగుడిలోని స్వయంభు సిద్దేశ్వర శివలింగాన్ని ఎలా తాకుతున్నాయి..? ఆ రహస్యం ఆలయ పూజారులకు సైతం అంతు చిక్కడం లేదు. ఇది ఆలయ నిర్మాణంలో నైపుణ్యమో…? లేక నిజంగా శివుడి మహత్యమో ఏమో కానీ భక్తులకు మాత్రం ఓ విచిత్రంగా కనిపిస్తుంది. సూర్య దర్శనం అనంతరం శివుడికి కొత్తశక్తి లభిస్తుందని భావిస్తున్న భక్తులు, పెద్ద ఎత్తున తరలి వచ్చి శివలింగానికి అభిషేకాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

ఈ విచిత్రాన్ని ఛేదించేందుకు ఇప్పటికే కాకతీయ యూనివర్సిటీ, ఎన్ఐటికి చెందిన ఇంజనీరింగ్ నిపుణులు అనేక పరిశోధనలు చేశారు. కానీ వారికి కూడా అంతు చిక్కడం లేదు. కేవలం ఈ మూడు రోజులు మాత్రమే ఎలా సూర్యకిరణాలు గర్భగుడిలోని శివలింగంపై పడుతున్నాయో? ఇంజనీరింగ్ నిపుణులకు, భక్తులకు అర్థం కావడం లేదు. దీంతో ఇది ఖచ్చితంగా పరమ శివుడి మహత్యమే అని భావించి పులకరించిపోతున్నారు భక్త జనం.

మరిన్ని అధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..