Govardhan Puja 2023: గోవర్ధన పూజ విధానం, శుభ సమయం.. ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పించాలంటే..

|

Nov 13, 2023 | 8:05 AM

గోవర్ధన్ పూజ తిథి ఈ రోజు నవంబర్ 13వ తేదీ మధ్యాహ్నం 2:56 గంటలకు ప్రారంభమవుతుంది. రేపు అంటే నవంబర్ 14వ తేదీ మధ్యాహ్నం 2:36 గంటల వరకు ఈ తిథి కొనసాగుతుంది. ఉదయ తిథి ప్రకారం గోవర్ధన పూజ నవంబర్ 14 న జరుపుకుంటారు. కొన్ని ప్రదేశాల్లో అన్నా చెల్లెళ్ల పూజను నవంబర్ 14న జరుపుకోనున్నారు. కనుక ఈ రోజు గోవర్ధన్ పూజను నవంబర్ 13న పవిత్రమైన సమయంలో పూజ చేయవచ్చు. అదే సమయంలో నవంబర్ 14 ఉదయం గోవర్ధన్ పూజ కూడా చేయవచ్చు.

Govardhan Puja 2023: గోవర్ధన  పూజ విధానం, శుభ సమయం.. ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పించాలంటే..
Govardhan Puja
Follow us on

ప్రతి సంవత్సరం దీపావళి మర్నాడు గోవర్ధన్ పూజను జరుపుకుంటారు. దీనిని అనేక ప్రాంతాల్లో అన్న కూట్ అని కూడా అంటారు. ఈ పండగకు హిందువుల జీవితంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ పండగ ప్రకృతికి మానవులకు మధ్య ఉన్న సంబంధంకి ప్రతీక. గోవర్ధన్ పూజలో గోవులను పూజిస్తారు. అంతేకాదు శ్రీ కృష్ణుడిని  సంప్రదాయంగా పూజిస్తారు. గోవర్ధనుడికి 56 రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. ఆవుని, గోవర్ధునుడిని పూజించడం వలన శ్రీకృష్ణుని అనుగ్రహం లభిస్తుంది.

గోవర్ధన్ పూజ ఎప్పుడు?
ఈ సంవత్సరం గోవర్ధన పూజ విషయంలో కూడా గందరగోళం నెలకొంది.  నవంబర్ 13 న లేదా నవంబర్ 14 న జరుపుకోవాలా అనే విషయంలో చాలా గందరగోళం ఉంది. వేర్వేరు రోజుల్లో శుభ ముహూర్తాలు రావడంతో ఈ గందరగోళం తలెత్తుతోంది. ఈసారి నవంబర్ 13, 14 తేదీల్లో గోవర్ధన్ పూజను నిర్వహించనున్నారు.

గోవర్ధన్ పూజ శుభ సమయం

గోవర్ధన్ పూజ తిథి ఈ రోజు నవంబర్ 13వ తేదీ మధ్యాహ్నం 2:56 గంటలకు ప్రారంభమవుతుంది. రేపు అంటే నవంబర్ 14వ తేదీ మధ్యాహ్నం 2:36 గంటల వరకు ఈ తిథి కొనసాగుతుంది. ఉదయ తిథి ప్రకారం గోవర్ధన పూజ నవంబర్ 14 న జరుపుకుంటారు. కొన్ని ప్రదేశాల్లో అన్నా చెల్లెళ్ల పూజను నవంబర్ 14న జరుపుకోనున్నారు. కనుక ఈ రోజు గోవర్ధన్ పూజను నవంబర్ 13న పవిత్రమైన సమయంలో పూజ చేయవచ్చు. అదే సమయంలో నవంబర్ 14 ఉదయం గోవర్ధన్ పూజ కూడా చేయవచ్చు. ఎదుకంటే అన్నాచెల్లెళ్ల పండగ రేపు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రారంభమవుతుంది. ఈ విధంగా మీరు ఒకే రోజులో రెండు పండుగలు జరుపుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

గోవర్ధన్ పూజ ఉదయం మాత్రమే నిర్వహిస్తారు. అందుకే నవంబర్ 14న ఉదయం 6:43 నుండి 8:52 వరకు గోవర్ధన్ పూజ చేయడానికి అనుకూలమైన సమయం ఉంటుంది. ఈ 2 గంటలలో పూజ చేయవచ్చు. ఈ రోజు  ఆవు పేడతో గోవర్ధన్ పర్వతాన్ని తయారు చేసి పూజిస్తారు.

గోవర్ధన్ పూజ విధానం

  1. గోవర్ధన పూజ ప్రారంభించడానికి ముందు.. ఆవు పేడతో ఒక పర్వతాన్ని తయారు చేయండి.
  2. గోవర్ధన పర్వతం ఆకారాన్ని తయారు చేయడమే కాకుండా ఆవుని కూడా తయారు చేయండి.
  3. గోవర్ధన పర్వతాన్ని తయారు చేసిన తర్వాత.. దాని దగ్గర నూనె దీపం వెలిగించండి.
  4. తర్వాత పూలు, పసుపు, బియ్యం, చందనం, కుంకుమను సమర్పించండి.
  5. గోవర్ధన పూజ సమయంలో  మిఠాయిలను నైవేద్యంగా సమర్పించి.. ప్రసాదంగా పంపిణీ చేస్తారు.
  6. పాల పర్ధాలతో తయారు చేసిన ఆహార పదార్ధాలను కన్నయ్య, గోవర్ధన పర్వతానికి సమర్పించిన తర్వాత..  ముకుళిత హస్తాలతో గిరిధరుడిని ప్రార్థించండి. అనంతరం గోవర్ధన పూజకు సంబంధించిన కథను  చదవండి.
  7. ఇవన్నీ సమర్పించిన తర్వాత గోవర్ధన ఉత్సవానికి ఏడుసార్లు ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుడు సంతోషిస్తాడు. తనను పూజించిన భక్తులను అనుగ్రహిస్తాడు.

గోవర్ధన పూజ ప్రాముఖ్యత

గోవర్ధన పూజ రోజున శ్రీ కృష్ణుడు ఎవరు ఆరాధిస్తారో అతని ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటుందని  అతనిపై ఆశీర్వాదం లభిస్తుందని మత విశ్వాసం. ఈ రోజున గోవర్ధనుడిని పూజించడం ద్వారా జీవితంలోని కష్టాలు, బాధలు తొలగిపోతాయని నమ్ముతారు. అంతేకాకుండా కన్నయ్య, లక్ష్మీ దేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది. గోవర్ధన పూజ రోజున ఆవులను, శ్రీ కృష్ణుడిని పూజిస్తే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు తొలగిపోతాయని ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు