Srisialam Temple: ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలం. నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల ఈ శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతుంటుంది అయితే కరోనా వైరస్ ఎఫెక్ట్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలపై కూడా పడింది. కరోనా వైరస్ కట్టడి కోసం నిత్యం రద్దీగా ఉండే ఆలయాల్లో భక్తుల దర్శనాన్ని నిలిపివేశారు. ఆలయాలు సైతం మూతపడ్డాయి. ఇటీవల ఆంక్షల సడలింపుతో కొన్ని ఆలయాలు పూర్తి స్థాయిలో తెరుచుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో తాజా మల్లన్న భక్తులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో కూడా కరోనా నిబంధనలను అనుసరించి దర్శనాలకు అనుమతిస్తున్నారు.
రేపటి నుండి శ్రీశైలంలో స్పర్శ దర్శనం ప్రారంభం కానుంది. ఈ నెల 18 నుంచి భక్తుల సౌకర్యార్థమై దశల వారిగా స్వామివార్ల స్పర్శదర్శనం కల్పించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు స్వామివార్ల స్పర్శదర్శనం కల్పించేందుకు వీలు కల్పిస్తున్నారు.
కోవిడ్ నిబంధనలు దృష్టిలో ఉంచుకుని కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ అభిషేకాలు నిర్వహింపబడుతాయి. ఇందులో భాగంగా రోజుకు 7 విడతలలో గర్భాలయ ఆర్జిత అభిషేకాలు నిర్వహించబడుతాయి. రోజుకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 6 విడతలలోనూ, సాయంకాలం ఒక విడతగాను ఈ గర్భాలయ అభిషేకాలు నిర్వహించబడుతాయి. భక్తులు కరెంట్ బుకింగ్ ద్వారా ఈ అభిషేకసేవా టికెట్లను పొందవచ్చును.
ప్రతిరోజూ నాలుగు విడతలుగా సామూహిక అభిషేకాలను నిర్వహించడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా మరియు కరెంట్ బుకింగ్ ద్వారా కూడా ఈ టికెట్లను పొందే అవకాశం.
మొదటి విడత గం. 6.30లకు,
రెండవ విడత గం. 10.00 గంటలకు,
మూడవ విడత 12.30 గంటలకు,
నాల్గవ విడతలుగా సాయంత్రం 6.30 గంటలకు నిర్వహించబడుతాయి.
సామూహిక అభిషేక సేవాకర్తలకు అభిషేకానంతరం స్వామివారి స్పర్శదర్శనం కల్పించబడుతుంది.
Also Read: Clay Pots For Cooking: ఈ మట్టి పాత్రల్లో వండే ఆహారం తింటే కొన్ని నెలలోపే డయాబిటీస్ నుండి విముక్తి అట