AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhuvaneshwari Temple: కీళ్ళనొప్పులు, వాత వ్యాధులను నయం చేసే ఆలయంలోని మట్టి.. ఆలయ విశిష్టత, చరిత్ర తెలుసుకోండి

భువనేశ్వరి అమ్మవారి ఆలయంలోని మట్టిని శరీరానికి పూయడం వల్ల వాత సంబంధిత వ్యాధులు, కీళ్లనొప్పులు తగ్గుతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఆషాఢమాసం ఆదివారాల్లో భక్తుల రద్దీ ఉంటుంది. ఆలయానికి సంబంధించిన విశేషాలను ఈరోజు తెలుసుకుందాం.. 

Bhuvaneshwari Temple: కీళ్ళనొప్పులు, వాత వ్యాధులను నయం చేసే ఆలయంలోని మట్టి.. ఆలయ విశిష్టత, చరిత్ర తెలుసుకోండి
Godess Bhuvaneshwari Temple
Surya Kala
|

Updated on: Jul 13, 2022 | 1:06 PM

Share

Bhuvaneshwari Temple: ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో భువనేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో  ఈ ఆలయాన్ని  భూయన్య రాణి మందిరం అని పిలుస్తారు. ఈ ఆలయానికి ఎంతో గుర్తింపు ఉంది. ఈ దేవాలయంలోని మట్టికి ప్రత్యేకత ఉంది. ఈ ఆలయ మట్టి చాలా శక్తివంతమైనదని చెబుతారు. దీన్ని శరీరానికి పూయడం వల్ల వాత సంబంధిత వ్యాధులు, కీళ్లనొప్పులు తగ్గుతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఆషాఢమాసం ఆదివారాల్లో భక్తుల రద్దీ ఉంటుంది. ఆలయానికి సంబంధించిన విశేషాలను ఈరోజు తెలుసుకుందాం..

విశ్వాసం మట్టితో ముడిపడి ఉంది హమీర్‌పూర్ జిల్లా కేంద్రానికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝలోఖర్ గ్రామంలోని భువనేశ్వరి దేవి (భుయాన్ రాణి) ఆలయానికి ఆషాడ మాసంలో భక్తుల రద్దీ నెలకొంటుంది. ఆలయం వేపచెట్టు కింద వేదికను నిర్మించి.. వేదికపై కొన్ని విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే భక్తుల విశ్వాసం ఇక్కడి మట్టికి సంబంధించినది. ఇక్కడి మట్టిని శరీరమంతా పూయడం వల్ల ఎముకలకు సంబంధించిన అన్ని వ్యాధులు, కీళ్లనొప్పులు కూడా నయమవుతాయని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. శారీరక వ్యాధులతో బాధపడే ప్రజలు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుంటారు.

కోలుకున్న వేలాది మంది రోగులు  ఇప్పటివరకు వేలాది మంది ప్రజలు ఎముకల, కీళ్ల వ్యాధులనుంచి కోలుకున్నారని స్థానిక నివాసి అభిషేక్ త్రిపాఠి చెప్పాడు. చాలా సార్లు నయం చేయలేని వ్యాధులతో రోగులు ఇక్కడికి వస్తారని.. కొంతమంది రోగులను బంధువులు తమ భుజాలపై ఎక్కించుకుని దేవాలయానికి తీసుకొస్తారు.  కోలుకున్న తర్వాత వారు తమ కాళ్ళపై తిరిగి నడుచుకుంటూ వెళ్లారు. ఈ ఆలయంలో భక్తుల ప్రతి కోరిక నెరవేరుతుంది.

ఇవి కూడా చదవండి

ఆలయ చరిత్ర ఆలయ పూజారి సంతోష్ ప్రజాపతి తెలిపిన వివరాల ప్రకారం.. వందల ఏళ్ల క్రితం ఈ ప్రదేశం చెరువులు, పొదలతో నిండి ఉండేది. ఒక బ్రాహ్మణుడు భయంకరమైన వాతంతో బాధపడి ఆత్మహత్య చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు.. ఒక ఆవు రాత్రి అడవిలో ఇక్కడకు వచ్చి, తన పాలన్నీ ఒకే చోట వేసి వెళ్లిపోవడం అతను చూశాడు. ఇది చూసిన బ్రాహ్మణుడు ఆలోచనలో పడ్డాడు. అంతేకాదు అతడు నిద్రపోతున్నప్పుడు,  ఆత్మహత్య చేసుకోవద్దని కల వచ్చింది. ఆవు పాలు వదిలిన సూరజ్‌కుండ్ అనే ఈ చెరువులో స్నానం చేసి.. అక్కడ ఉన్న మట్టిని శరీరానికి రాసుకోండి. ఇది మీ వ్యాధిని నయం చేస్తుందని కలలో కనిపించింది. తెల్లవారుజామున నిద్రలేచిన బ్రాహ్మణుడు కలలో వచ్చిన విధానాన్ని పాటిస్తూ..  చెప్పినట్లే చేశాడు. దీంతో అతని వ్యాధి నయమైంది. అప్పటి నుండి.. వాత వ్యాధితో బాధపడుతున్న రోగులు ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ మట్టిని తమ శరీరానికి పూసుకుంటారు.

ఆషాఢ మాసం ఆదివారానికి ప్రత్యేక గుర్తింపు భువనేశ్వరి దేవి ఆలయంలో ఆషాఢ మాసంలోని ఆదివారానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆషాఢమాసం ఆదివారం నాడు ఇక్కడ జాతర జరుగుతుంది.  రాణి దర్శనం కోసం ఈ రోజు వేలాది మంది భక్తులు వస్తారు. స్థానిక నివాసి సతేంద్ర అగర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం.. వాత రోగులు శనివారాల్లో ఇక్కడికి వచ్చి తమతో పాటు ఆహార పదార్థాలు తీసుకువస్తుంటారు. ఆదివారాలు భౌరీలు చేసి తింటారు. ఇక్కడ ఉన్న చెరువులో స్నానం చేస్తారు. అప్పుడు వారు తల్లికి తమ వ్యాధిని నయం చేయమని విన్నవించుకుంటారు. దీని తరువాత, శరీరంపై మట్టి ముద్దను పూసుకుంటారు. ఇక్కడ ఉన్న చెరువు మట్టిని ఆలయ వేదికపై పోస్తారు.

నేటికీ నిర్మాణం జరగని ఆలయంపై పైకప్పు   ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే, ఇప్పటి వరకు ప్లాట్‌ఫారమ్‌పై పైకప్పును నిర్మించలేదు. ఎవరైనా పైకప్పు నిర్మించడానికి ప్రయత్నించినప్పుడు, ఆ పైకప్పు విరిగిపోయింది. ఈ లోయను పాలించిన బందిపోటు సుందరి ఫూలన్ దేవి కూడా అమ్మవారి భక్తురాలే నని చెబుతారు. పూలన్ దేవి  బందిపోటుగా జీవితం గడిపిన సమయంలో ఈ ఆలయంలో గంటను సమర్పించిందట.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..