Name Astrology: ఈ 4 అక్షరాలతో పేర్లు ఉండే అమ్మాయిలు అత్తింటివారికి అదృష్టాన్ని తీసుకెళ్తారు..!
Name Astrology: పెళ్లి తర్వాత ప్రతి అబ్బాయి, అమ్మాయి జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక అమ్మాయికి పెళ్లి అయి..
Name Astrology: పెళ్లి తర్వాత ప్రతి అబ్బాయి, అమ్మాయి జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక అమ్మాయికి పెళ్లి అయి.. అత్తారింటికి వెళ్లిన తరువాత ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి సడన్‌గా మారిపోతుంటుంది. ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. అత్తమామల సమస్యలు దూరమవుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అమ్మాయికి జీవనచక్రంలో ఉన్న శుభ గ్రహాలు, రాశుల వల్ల వస్తుంది. ఇదే కాకుండా.. కొన్ని అక్షరాలతో మొదలయ్యే అమ్మాయిలు పెళ్లి చేసుకున్న తరువాత తమ భర్త కుటుంబానికి అదృష్టంగా మారుతారు. వీటిలో ప్రధానంగా నలుగు అక్షరాల పేర్లు గల అమ్మాయిలు మెట్టింటికి అదృష్ట లక్ష్మిగా భావిస్తారు.
G పేరుతో ఉన్న అమ్మాయిలు: ఈ అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలు వారి అత్తమామలకు అదృష్టవంతులుగా పరిగణించబడతారు. వీరి రాకతో భర్తే కాదు అతని కుటుంబసభ్యుల జీవితంలో కూడా ఆనందం వెల్లివిరిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆమెను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అలాగే ‘G’ పేరుతో ప్రారంభమయ్యే అమ్మాయిలు పరిపూర్ణవాదులు, ప్రతిదీ సరైన విధంగా జరగాలని కోరుకుంటారు.
K పేరుతో.. ఈ అక్షరంతో ప్రారంభం అయ్యే పేరు గల అమ్మాయిలను కూడా లక్ష్మీదేవి ప్రతిరూపాలుగా కొలుస్తారు. ఈ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు నివసించే ఇంట్లో ఐశ్వర్యానికి, సంపదకు ఏమాత్రం లోటు ఉండదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వీరు భర్త, అత్తమామల నుంచి మంచి ప్రేమానురాగాలను పొందుతారు. పెళ్లి చేసుకున్న వారి ఇంట్లో అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి.
L పేరుతో.. ఈ అక్షరంతో పేరు గల అమ్మాయిలను కూడా అదృష్టానికి కేరాఫ్‌గా పేర్కొంటారు. వీరు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిన తరువాత వారి ఇంట్లో ఆర్థిక సంక్షోభాలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీ దేవి అనుగ్రహం వీరిపై ఉంటుంది. వారి రాకతో భర్త కెరియర్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద పరంగా వీరు నిజంగా అదృష్టవంతులవుతారు. అంతేకాదు.. వీరు విశాల హృదాయాన్ని కలిగి, దాతృత్వ స్వభావాన్ని కలిగి ఉంటారు.
P పేరుతో.. ఈ పేరుతో ఉన్న అమ్మాయిల వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. వీరికి మంచి, ప్రేమగా చూసుకునే భర్త, అత్తమామలు వస్తారు. అత్తామామలు అందరూ ఆమెను గౌరవిస్తారు. ఈ పేరుగల అమ్మాయి ఇంట్లోకి వచ్చిన తరువాత భర్త, అతని కుటుంబానికి అదృష్టం వరిస్తుంది. ఆర్థికంగా, సామాజికంగా ఎంతో అభివృద్ధి చెందుతారు. చుట్టాలతో వీరి సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది.
Also read:
AP Assembly: డిప్యూటీ సీఎంపై టీడీపీ ప్రివిలేజ్ నోటీసులు.. నారాయణ స్వామి ఏమన్నారంటే..?