శివ ప్రసన్నం కోసం శునకాల్లా మారే భక్తులు.. ఇలా చేస్తేనే కోర్కెలు తీరుతాయట..! ఎక్కడో తెలుసా..?

Gavi Matam Brahmotsavam: ఎన్నో విచిత్ర ఆచారాలు, నమ్మకాలకు పెట్టింది పేరు భారతదేశం. ఈ క్రమంలోనే రకరకాల ఉత్సవాలు, వేడుకలు జరుగుతుంటాయి. అందులో కొన్ని ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంటాయి.

శివ ప్రసన్నం కోసం శునకాల్లా మారే భక్తులు.. ఇలా చేస్తేనే కోర్కెలు తీరుతాయట..! ఎక్కడో తెలుసా..?
Gavi Matam Brahmotsavam

Edited By: Team Veegam

Updated on: Mar 26, 2021 | 1:49 PM

Gavi Matam Brahmotsavam: ఎన్నో విచిత్ర ఆచారాలు, నమ్మకాలకు పెట్టింది పేరు భారతదేశం. ఈ క్రమంలోనే రకరకాల ఉత్సవాలు, వేడుకలు జరుగుతుంటాయి. అందులో కొన్ని ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంటాయి. అలాంటి వాటిలో ఒక ఉరవకొండ గవిమఠం బ్రహ్మోత్సవాలు ఒకటి.  కురుబ కులస్తులు ఎంతో వేడుకగా జరుపుకునే ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు ఆచరించే వింత ఆచారం ఆకట్టుకుంటోంది. ఈ వేడుకలు అనంతపురం జిల్లా ఉరవకొండలో ప్రతీ ఏటా జరుగుతాయి. ఎంతో ఘనంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగిశాయి. కురుబ కులస్తుల ఆధ్వర్యంలో జరిగిన గొరవయ్యల ఒగ్గు సేవ, సంప్రదాయ నృత్యం… గొరవయ్యలు శునకాల్లాగా మారి అరుచుకుంటూ నాలుకతో పాలు తాగాడం వీరి ఆచారంలో ఓ భాగం. తరతరాలుగా ఈ కులం వారు ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు.

Oggu Seva

అసలేంటీ ఒగ్గుసేవ..?

భక్తులు కుక్కల్లాగా మారి పాలు తాగుతూ, అరిచే ఈ కార్యక్రమాన్ని ఒగ్గుసేవగా పిలుస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా దొన్నెలలోని వేసిన పాలను గొరువయ్యలు శునకాల్లాగా అరుచుకుంటు కొట్టుకుంటూ నాలుకలతో తాగుతారు. గవిమఠం బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజున ఈ ఒగ్గు సేవ చేస్తారు. భక్తులు తెచ్చిన పాలు, పెరుగు, పండ్లు దొణెలలో పోసి ఈ గిన్నెలను వరుసగా ఉంచుతారు. ఈ దోనెల (గిన్నెలు) చుట్టూ డమరుకం వాయిస్తూ తిరుగుతూ శునకాల్లాగా మారి అరుస్తూ, మెడలపై కరచుకుంటారు. ఒగ్గు సేవ తరువాత దోనెలలో మిగిలిన పాలు, పెరుగు, పండ్లు శివ ప్రసాదంగా భావించి భక్తులు సేవిస్తారు.

Oggu Seva 1

ఈ ఆచారం ఎందుకు వచ్చింది..?

భక్తులు పాటించే ఈ విశ్వాసం వెనక చారిత్రాత్మక కథ ఉన్నట్లు భక్తులు విశ్వసిస్తుంటారు. భక్తుల నమ్మకం ప్రకారం.. పాల సముద్రాన్ని అమృతం కోసం చిలికేటప్పుడు ఉద్భవించిన హాలాహలాన్ని శివుడు తాగుతాడు. అయితే గరళాన్ని గొంతులో దాచుకున్న శివుడు రాత్రంతా నిద్రపోకుండా ఉండడానికి దేవతలు భజనలు చేస్తారు. అయితే కొంతసేపటికే దేవతలంతా నిద్రపోవడంతో.. పార్వతి భైరవాంశ సంభూతమైన ఆరు శునకాలను ఒక దొన్నెలో పాలు వేసి తాగిస్తుంది. దీంతో ఆ శునకాలు పోట్లాడుతూ పాలు తాగడంతో శివుడు నిద్ర పోలేదని భక్తుల విశ్వాసం. శివుడిని నిద్ర పోకుండా చేసిన ఆ భైరవాంశ సంభూత రూపాలే గొరవయ్యలని చెబుతుంటారు. ఈ కారణంగానే ప్రజలు శుకాల్లాగా మారి పాలు తాగుతూ సేవ చేస్తారని భక్తులు నమ్ముతుంటారు.

Also Read: Horoscope Today: ఈ రాశి వారు వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.. శుక్రవారం మీ రాశిఫలం ఎలా ఉందో చూసుకోండి..

రుక్మిణీ సమేత శ్రీకృష్ణావతారంలో దర్శనమిచ్చిన తిరుమలేశుడు.. చూడముచ్చటగా తిరుమల తెప్పోత్సవం

వారణాసి నుంచి అయోధ్య వరకూ ఒకేసారి సందర్శించాలనుకుంటున్నారా..? ఈ స్పెషల్ ప్యాకేజీ మీకోసమే