AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశి వారు వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.. శుక్రవారం మీ రాశిఫలం ఎలా ఉందో చూసుకోండి..

Horoscope Today: ప్రతిరోజూ ఓ కొత్త అవకాశంగా చెబుతారు. కొత్త రోజును కొత్తగా ప్రారంభిస్తూ ఎన్నో అవకాశాలను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే రాశిఫలం ఎలా...

Horoscope Today: ఈ రాశి వారు వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.. శుక్రవారం మీ రాశిఫలం ఎలా ఉందో చూసుకోండి..
Horoscope Today
Narender Vaitla
|

Updated on: Mar 26, 2021 | 8:13 AM

Share

Horoscope Today: ప్రతిరోజూ ఓ కొత్త అవకాశంగా చెబుతారు. కొత్త రోజును కొత్తగా ప్రారంభిస్తూ ఎన్నో అవకాశాలను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే రాశిఫలం ఎలా ఉందో తెలుసుకుంటూ.. రోజును ప్రారంభించే వారు మనలో చాలా మందే ఉంటారు. అలాంటి వారు ఈరోజు రాశిఫలం ఎలా ఉందో తెలుసుకొని రోజును ప్రారంభించండి. శుక్రవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..

మేష రాశి:

ఈరాశివారు ఈరోజు చేపట్టే పనులను కొంత నిధానంగా పూర్తిచేసే ప్రయత్నం చేయండి. అలాగే వీరు కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా చేపడుతారు. లక్ష్మీ నారసింహ స్వామి వారి దర్శనం ఈ రాశివారికి మేలు చేస్తుంది.

వృషభ రాశి:

వృషభ రాశివారు ఈరోజు కొన్ని వ్యక్తిగతమైన కార్యక్రమాలను చేపడుతుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అప్పుల భారాలు పెరిగే సూచన కనిపిస్తుంది. ‘ఓం శరవన భవ’ అనే నామ జపం చేసుకోవడం ఈ రాశివారికి సూచించదగ్గ అంశం.

మిథున రాశి:

ఈ రాశివారికి ఈరోజు స్నేహితులు లేదా బంధువుల నుంచి మంచి మంచి ఆహ్వానాలు అందుతుంటాయి. వాటిని జాగ్రత్తగా అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి. వీరికి ఆధ్యాత్మిక భావనలు ఏర్పడుతుంటాయి. శంక పుష్పాలను సేకరించి పరమేశ్వరుడికి అర్చన నిర్వహించుకుంటే శుభ ఫలితాలు లభిస్తాయి.

కర్కాటక రాశి:

కర్కాట రాశి వారు ఈరోజు ఆర్థిక పరమైన అభివృద్ధి కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు. విద్యార్థులకు సహకారం అవసరమవుతుంటుంది. ‘ఓం గం గణపతే నమః’ అనే నామస్మరణ ఈ రాశి వారికి మేలు చేస్తుంది.

సింహ రాశి:

ఈ రాశివారికి ఈరోజు సౌకర్యాల వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విష్ణు సహస్త్ర నామ స్తోత్ర పారాయణం ఈ రాశివారికి సూచించదగ్గ అంశం.

కన్య రాశి:

కన్య రాశివారికి ఆదాయాన్ని మించిన ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తు్న్నాయి. వ్యక్తిగత, ఉద్యోగాది విషయాల్లో అదనపు బాధ్యతలు చేపట్టాల్సిన సందర్భాలు ఎదురవుతుంటాయి. మహాలక్ష్మి ఆరాధన మేలు చేస్తుంది.

తులా రాశి:

ఈ రాశివారు ఈ రోజు చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు. మాట విలువ కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ‘ఓం దుం దుర్గాది నమః’ అనే నామ జపం ఈ రాశివారికి సూచించదగ్గ అంశం.

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారు ఈరోజు చేపట్టిన పనులను పూర్తి చేయడానికి దగ్గరి వారు సహకరిస్తుంటారు. విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆంజనేయ స్వామి పూజా, అర్చన మేలు చేస్తుంది.

ధనుస్సు రాశి:

ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనుల్లో కాస్త శ్రమ పెరుగుతుంది. ఉద్యోగాది విషయాల్లో శుభ ఫలితాల కోసం తీవ్రమైన కృషి చేస్తుంటారు. విష్ణు సహస్త్ర నామ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

మకర రాశి:

మకర రాశి వారు ఈరోజు వ్యక్తిగతంగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కుంభ రాశి:

కుంభ రాశివారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అనారోగ్యాలు దరిచేరకుండా ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గణపతి నామర్చన ఈ రాశివారికి మేలు చేస్తుంది.

మీన రాశి:

ఈ రాశికి వారికి ఆస్తి సంబంధిత వివాదాలను పరిష్కరించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అలాగే పలు శుభకార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోగలుగుతారు. గరికతో గణపతి అర్చన చేసుకోవడం ఈ రాశివారికి సూచించదగ్గ అంశం.

Also Read: రుక్మిణీ సమేత శ్రీకృష్ణావతారంలో దర్శనమిచ్చిన తిరుమలేశుడు.. చూడముచ్చటగా తిరుమల తెప్పోత్సవం

Holi 2021: హొలీ వేడుకలకు సన్నద్ధమవుతున్నారా..! ఆయా రాష్ట్రాల్లో ఆంక్షలు ఏమిటో తెలుసా..!

Nidhivan Mystery : ఆ పుణ్యక్షేత్రంలో నేటికీ రాధాకృష్ణుల రాసలీలలు.. మర్మం కనిపెట్టడానికి వెళ్లినవారికి కళ్ళు పోయిన వైనం

Follow Us
గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన చికెన్‌ ధరలు.. కేజీ ఎంతంటే..!
గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన చికెన్‌ ధరలు.. కేజీ ఎంతంటే..!
వీడి క్రియేటివిటీ చూసి ఇంజనీర్లు కూడా స్టన్.!
వీడి క్రియేటివిటీ చూసి ఇంజనీర్లు కూడా స్టన్.!
జపనీస్ స్కూల్ ఆడపిల్లల స్కర్టులు అంత పొట్టిగా ఎందుకుంటాయ్? కారణం
జపనీస్ స్కూల్ ఆడపిల్లల స్కర్టులు అంత పొట్టిగా ఎందుకుంటాయ్? కారణం
అతను పోలీసే కాదు.. డ్రెస్ వేసుకుని దర్జాగా లోపలికి వెళ్లాడు..
అతను పోలీసే కాదు.. డ్రెస్ వేసుకుని దర్జాగా లోపలికి వెళ్లాడు..
బ్రౌన్ షుగర్ తింటే బరువు తగ్గుతారా? వైట్ షుగర్‌తో లాభమేంటి?
బ్రౌన్ షుగర్ తింటే బరువు తగ్గుతారా? వైట్ షుగర్‌తో లాభమేంటి?
చికెన్ మాంసంలోని ఈ 10 భాగాలను అస్సలూ ముట్టొద్దు.. పొరపాటు జరిగింద
చికెన్ మాంసంలోని ఈ 10 భాగాలను అస్సలూ ముట్టొద్దు.. పొరపాటు జరిగింద
'హనుమాన్' సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
'హనుమాన్' సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
భర్త వద్దు.. ప్రియుడే కావాలి.. వివాహిత మంకుపట్టు.. !
భర్త వద్దు.. ప్రియుడే కావాలి.. వివాహిత మంకుపట్టు.. !
భయం అది పుట్టించింది ఎవరు మేము.. కంబ్యాక్ ఇంకా గట్టిగా ఇస్తాం
భయం అది పుట్టించింది ఎవరు మేము.. కంబ్యాక్ ఇంకా గట్టిగా ఇస్తాం
ఏసీలో కూర్చొంటే హైబీపీ వస్తుందా? డాక్టర్లు ఏమన్నారో తెలుసా?
ఏసీలో కూర్చొంటే హైబీపీ వస్తుందా? డాక్టర్లు ఏమన్నారో తెలుసా?