Ganesh Chaturthi 2022: జై గణేశా.. జై జై గణేశా.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ వినాయక చవితి శుభాకాంక్షలు..

| Edited By: Ravi Kiran

Aug 31, 2022 | 6:17 PM

ప్రతి చోటా విగ్రహ ప్రతిష్ఠాపన, ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. జై గణేశా.. జై జై గణేశా.. తెలుగు లోగిళ్లలో గణపయ్యలు కొలువుదీరుతున్నారు. కాగా, గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 

Ganesh Chaturthi 2022: జై గణేశా.. జై జై గణేశా.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ వినాయక చవితి శుభాకాంక్షలు..
Pm Modi
Follow us on

దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంగరంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి చోటా విగ్రహ ప్రతిష్ఠాపన, ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. జై గణేశా.. జై జై గణేశా.. తెలుగు లోగిళ్లలో గణపయ్యలు కొలువుదీరుతున్నారు. కాగా, గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. గణేశుడి ఆశీస్సులు మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా గణేష్ ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ చతుర్థి పండుగను భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు జరుపుకుంటారు.

దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గణేష్ చతుర్థికి శుభాకాంక్షలు తెలిపారు. అడ్డంకులను నాశనం చేసే, పనిని సాధించే గణేశుడిని మనం ఎల్లప్పుడూ నమస్కరిస్తాం, పూజిస్తాము. గణేశుడి ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆయన ప్రజలకు ఆకాంక్షించారు.

“యతో బుద్ధిరజ్ఞాననాశో ముముక్షోర్యతః

సంపదో భక్త సంతోషికాః స్యుః //

యతో విఘ్ననాశో యతః కార్యసిద్ధిః

సదా తం గణేశం నమామో భజామః //

ఎవరి వల్ల ఆటంకాలు నశింపబడతాయో, ఎవరి నుండి కార్యం సిద్ధిస్తుందో ఆ వినాయకుడిని నిత్యం నమస్కరించి పూజిస్తాం. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు’ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. గణపతి బప్పా మోర్యా!”అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

సీఎం కేసీఆర్‌ వినాయక చవితి శుభాకాంక్షలు..

వినాయకుడి దీవెనలతో సకల జన సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. వినాయక చవితి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు..

వినాయక చవితి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. గణనాథుని కరుణాకటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధి చెందాలని ఆయన అభిలషించారు.

 మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం