ప్రతీ మనిషి కోరుకునే వాటిలో ఆరోగ్యం ఒకటైతే సంపద మరొకటి. చాలినంత సంపద ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసమే పనిచేస్తుంటారు కూడా. అయితే కొందరికి ఎన్ని రకాల ఆర్థిక వనరులు ఉన్నా. జీవితంలో మాత్రం ఎదుగుదల ఉండదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు జీవితంలో ఆర్థికంగా పెద్దగా ఎదుగుదల ఉండదు. ఎంత సంపాదించినా డబ్బు నిల్వకపోగా కొత్తగా అప్పులు అవుతుంటాయి. అయితే వాస్తు నిపుణులు చెప్పే కొన్ని సూచనలను పాటిస్తే ఆర్థిక పరిస్థితులు మెరుగై ఇంట్లో లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. వాస్తు నిపుణులు చెబుతోన్న ఆ చిట్కాలు ఏంటంటే..
* ఉదయాన్ని నిద్రలేవగానే కొందరికి దేవుడి చిత్ర పటాలు చూసే అలవాటు ఉంటే మరికొందరు మరికొన్ని అలవాట్లు ఉంటాయి. అయితే లక్ష్మీ దేవీ కటాక్షం మనపై ఎల్లవేలలా ఉండాలంటే ఉదయం నిద్ర లేవగానే అరచేతులను చూడాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే లక్ష్మీ మంత్రం జపించాలని చెబుతున్నారు.
* ఆహారం తినేప్పుడు కూర్చునే విధానం కూడా మనుషుల ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆహారం తీసుకునేటప్పుడు ముఖం తూర్పు దిశలో ఉండేలా చూసుకోండి.
* ఇంట్లో కచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూసుకోండి. తులసి మొక్కలో లక్ష్మీ దేవత నివసిస్తుందని నమ్ముతారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కోరికలను నెరవేరుస్తుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది.
* ఇక ఇంట్లో ఈశాన్య మూలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఈ ప్రదేశంలో ఎలాంటి వస్తువులు ఉండకూడదని వాస్తు నిపుణులు చెబుతుంటారు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం దుష్ట శక్తులు ఇంటి నుంచి దూరంగా ఉండాలంటే క్రమం తప్పకుండా ఈశాన్యంలో గంగాజలాన్ని చల్లుకోవాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..