ప్రతి రోజూ రాత్రి శివయ్య పార్వతితో పాచికలు ఆడటానికి ఇక్కడకు వస్తాడట.. ఈ క్షేత్రం ఎక్కడంటే

|

Jul 25, 2024 | 5:01 PM

ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి సంబంధించి అనేక నమ్మకాలు ఉన్నాయి. శివుడు రోజూ రాత్రి సమయంలో ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగంలో నివసిస్తాడనేది వీటిల్లో ప్రధానమైన నమ్మకం. ఈ ఆలయంలో శివుడు రాత్రి విశ్రాంతి తీసుకుంటాడని నమ్మకం. అందుకనే ఈ ఆలయం లోపల శివునికి రాత్రి సమయంలో మంచం వేస్తారు. ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి సంబంధించిన మరో నమ్మకం ఏమిటంటే.. ఈ ఆలయంలో శివుడు తల్లి పార్వతితో పచ్చిసీ ఆట ఆడతాడట. అందుచేత రాత్రి సమయంలో పచ్చీసు ఆటకు ఏర్పాటు చేసి గర్భగుడి తలుపు మూసి వేస్తారు.

ప్రతి రోజూ రాత్రి శివయ్య పార్వతితో పాచికలు ఆడటానికి ఇక్కడకు వస్తాడట.. ఈ క్షేత్రం ఎక్కడంటే
Omkareshwar Temple
Follow us on

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి ఓంకారేశ్వర ఆలయం. ఈ క్షేత్రం మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నది మధ్యలో మాంధాత అనే ద్వీపంలో ఉంది. ఇది జ్యోతిర్లింగాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. అంతేకాదు శివ భక్తులకు ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఈ జ్యోతిర్లింగం నర్మదా నది ఒడ్డున ఓం ఆకారంలో ఉన్న ద్వీపంలో ఉంది. అందుకే ఈ ఆలయానికి ‘ఓంకారేశ్వర’ ఆలయం అని పేరు వచ్చింది. ఈ ఆలయం ప్రాసస్యం గురించి స్కంద పురాణం, విష్ణు పురాణం, మహాభారతం వంటి హిందూ మతంలోని అనేక పురాతన గ్రంథాలలో ప్రస్తావించబడింది. ఇక్కడ శివుడు ఓంకారేశ్వర, మమలేశ్వర అనే రెండు రూపాలలో పూజించబడతాడు.

ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి

ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి సంబంధించి అనేక నమ్మకాలు ఉన్నాయి. శివుడు రోజూ రాత్రి సమయంలో ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగంలో నివసిస్తాడనేది వీటిల్లో ప్రధానమైన నమ్మకం. ఈ ఆలయంలో శివుడు రాత్రి విశ్రాంతి తీసుకుంటాడని నమ్మకం. అందుకనే ఈ ఆలయం లోపల శివునికి రాత్రి సమయంలో మంచం వేస్తారు.

ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి సంబంధించిన మరో నమ్మకం ఏమిటంటే.. ఈ ఆలయంలో శివుడు తల్లి పార్వతితో పచ్చిసీ ఆట ఆడతాడట. అందుచేత రాత్రి సమయంలో పచ్చీసు ఆటకు ఏర్పాటు చేసి గర్భగుడి తలుపు మూసి వేస్తారు. అంతేకాదు ఎట్టి పరిస్థితిలోనూ రాత్రి సమయంలో గుడి లోపలికి ఎవరూ వెళ్ళరు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఉదయం పచ్చీసు దాని పాచికలు గర్భాలయంలో చెల్లాచెదురుగా పడి ఉంటాయి. రాత్రి ఎవరో పాచికలు ఆడినట్లు కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగానికి సంబంధించి మరొక నమ్మకం ఏమిటంటే ఓంకారేశ్వర ఆలయంలో శివుడికి జలాభిషేకం చేయకుండా భక్తుల తీర్థయాత్రలన్నీ అసంపూర్తిగా పరిగణించబడతాయట.

ఓంకారేశ్వర జ్యోతిర్లింగ ప్రతిష్టకు సంబంధించిన పౌరాణిక కథ

ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ ప్రతిష్టకు సంబంధించి కొన్ని పౌరాణిక కథనాలు ఉన్నాయి. వాటిలో మాంధాత రాజుకు సంబంధించిన కథ చాలా ప్రత్యేకమైనది. ఈ పురాణం ప్రకారం పురాతన కాలంలో మాంధాత రాజు చాలా శక్తివంతమైన పాలకుడు. అతను గొప్ప శివ భక్తుడు. ఒకసారి అతను శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి.. అనుగ్రహం పొందడానికి ఓంకార పర్వతం మీద ఉన్న నర్మదా నది ఒడ్డున కఠినమైన తపస్సు ప్రారంభించాడు. అతని కఠిన తపస్సు చేయడం మొదలు పెట్టాడు. ఆ తపస్సు తీవ్ర రూపం దాల్చి మొత్తం విశ్వంపై ప్రభావం చూపింది.

అతని తపస్సుకు సంతోషించిన పరమశివుడు అతని ముందు ప్రత్యక్షమై రెండు వరాలను అడగమని అడిగాడు. మొదటి వరంలో మాంధాత రాజు ఈ పవిత్ర స్థలంలో ఎల్లప్పుడూ ఉండి భక్తులందరి కోరికలను తీర్చమని శివుడిని కోరాడు. ఈ పుణ్యక్షేత్రం పేరుతో పాటు నా పేరు కూడా మీతో కలకాలం నిలిచిపోవాలని ప్రజలు తనను స్మరించుకోవాలని రెండో వరాన్ని కోరుకున్నాడు.

అప్పుడు శివుడు మాంధాత రాజు రెండు కోరికలను నెరవేర్చాడు. జ్యోతిర్లింగ రూపంలో ఆ ప్రదేశంలో నివసించడం మొదలు పెట్టాడు. అందుకే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం స్వయం ప్రతిరూపం. అంటే ఇక్కడ శివలింగం ఏ దేవుడు, మానవుడూ నిర్మాణం కాదు.. స్వతహాగాఉద్భవించిందని విశ్వసిస్తారు. అప్పటి నుండి శివుడు ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ రూపంలో ఈ పవిత్ర స్థలంలో ఉన్నాడు. ఈ ప్రాంతాన్ని మాంధాత అని పిలుస్తారు.

హిందూ మతపరమైన ప్రాముఖ్యత

ఓంకారేశ్వర ఆలయానికి హిందూ మతంలో చాలా మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఓంకారేశ్వరాలయంలోని శివుడిని పూజించడం, నర్మదానదిలో స్నానం చేయడం వల్ల మనిషి చేసిన సకల పాపాలు నశించి మోక్షప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఈ పవిత్ర స్థలంలో ధ్యానం , పూజలు చేయడం వల్ల మనస్సుకు ప్రశాంతత, ఆధ్యాత్మిక బలం లభిస్తుంది. ఈ ప్రదేశం ధ్యానం, సాధన కోసం చాలా అద్భుతమైనది. ఓంకారేశ్వర్‌లో ఉన్న జ్యోతిర్లింగం నుండి దైవిక శక్తి ప్రసరిస్తుంది. ఇక్కడ ఉన్న సానుకూల శక్తి వ్యక్తుల జీవితంలో ఆనందం, శాంతి, సిరి సంపదలను తెస్తుంది. కోరికలు నెరవేరుతాయి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు