Srisailam: మల్లన్న క్షేత్రంలో రోజు రోజుకీ పెరుగుతున్న భక్తుల రద్దీ.. సౌకర్యాల కల్పనపై అధికారుల దృష్టి..

|

Jan 11, 2024 | 4:13 PM

ఆలయ ఈవో పెద్దిరాజు భక్తులకు కల్పిస్తున్న దర్శనం, వసతి, అన్నప్రసాద వితరణ, వాహనాల పార్కింగ్, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, వైద్యసేవలు, గో సంరక్షణ, ఆగమపాఠశాల నిర్వహణతో పాటు దేవస్థానంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి అంచనాల కమిటీ చైర్పర్సన్ కళావతికి వివరించారు. ఈ సంధర్భంగా అంచనాల కమిటీ చైర్పర్సన్ కళావతి మాట్లాడుతూ క్షేత్రాన్ని సందర్శించే మల్లన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించాలని సూచించారు. 

Srisailam: మల్లన్న క్షేత్రంలో రోజు రోజుకీ పెరుగుతున్న భక్తుల రద్దీ.. సౌకర్యాల కల్పనపై అధికారుల దృష్టి..
Srisailam Temple
Follow us on

నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో చేపటట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్పర్సన్ ఎం.ఎ.వి కళావతి సమీక్షించారు. స్థానిక భ్రమరాంబ అతిధిగృహంలో జరిగిన ఈ సమావేశంలో ఆలయ ఈవో పెద్దిరాజు, దేవస్థానం పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో పెద్దిరాజు భక్తులకు కల్పిస్తున్న దర్శనం, వసతి, అన్నప్రసాద వితరణ, వాహనాల పార్కింగ్, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, వైద్యసేవలు, గో సంరక్షణ, ఆగమపాఠశాల నిర్వహణతో పాటు దేవస్థానంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి అంచనాల కమిటీ చైర్పర్సన్ కళావతికి వివరించారు.

ఈ సంధర్భంగా అంచనాల కమిటీ చైర్పర్సన్ కళావతి మాట్లాడుతూ క్షేత్రాన్ని సందర్శించే మల్లన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించాలని సూచించారు.  అలానే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఉగాది మహోత్సవాలు, మొదలైన పర్వదిన రోజులలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ఆ సమయంలో భక్తుల సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు సమావేశానంతరం అంచనాల కమిటీ చైర్పర్సన్ ఎం.ఎ.వి కళావతి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..