
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయాన్ని జూన్ 15 నుంచి మూసివేస్తున్నారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని ఈవో వినోద్ చెబుతున్నారు. వేములవాడ రాజన్న ఆలయం మూసివేతపై కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని ఖండించారు. భక్తులెవరూ ఈ వార్తలను నమ్మవద్దని, సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయవద్దని ఆలయ ఈవో కోరుతున్నారు.
వేములవాడ రాజన్న ఆలయం గురించి ఎలాంటి సమాచారం అయినా అఫీషియల్ గా దేవాదాయ శాఖ నుంచి కానీ ఆలయ అధికారుల నుంచి వచ్చే సమాచారాన్ని భక్తులు విశ్వసించాలని, ఎవరు కూడా సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవాలను విశ్వసించవద్దన్నారు. ఇటీవల.. వేములవాడ ఆలయం మూసి వేస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతుంది. చాలా మంది భక్తులు..ఈ ప్రచారాన్ని నమ్ముతున్నారు. ఇప్పటి వరకు అభివృద్ధి పనులకు సంభందించిన టెండర్లు జరగలేదు. ఈ ప్రచారంతో. భక్తులు.. స్వామి వారిని పెద్ద ఎత్తున దర్శించుకుంటున్నారు. ప్రతి రోజు 50 వేయిల కు పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..