Senior Citizen Darshan in Tirumala : శ్రీవారి దర్శనానికి వృద్ధులకు ప్రత్యేక సదుపాయాలు.. అవిఏమిటో తెలుసుకుంటే దర్శనం చాలా ఈజీ

ప్రతి హిందువు కల కలియుగదైవం కొలువైన తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని. అయితే శ్రీవారి దర్శనానికి వెళ్ళడానికి అరవై ఏళ్ళు పైబడిన వయోవృద్ధులకు...

Senior Citizen Darshan in Tirumala :  శ్రీవారి దర్శనానికి వృద్ధులకు ప్రత్యేక సదుపాయాలు.. అవిఏమిటో తెలుసుకుంటే దర్శనం చాలా ఈజీ
Follow us
Surya Kala

|

Updated on: Mar 05, 2021 | 5:13 PM

Senior Citizen Darshan in Tirumala : ప్రతి హిందువు కల కలియుగదైవం కొలువైన తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని. అయితే శ్రీవారి దర్శనానికి వెళ్ళడానికి అరవై ఏళ్ళు పైబడిన వయోవృద్ధులకు ( సీనియర్ సిటిజన్స్) కు టీటీడీ ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఉచిత దర్శనాన్ని ఇస్తుంది. ఆ వివరాలు తీసుకుందాం..!

శ్రీవారి దర్శనానికి సీనియర్ సిటిజన్స్ కు రెండు సమయాలున్నాయి: ఉదయం 10కు. తరువాత సాయంత్రం 3 గంటలకు కల్పిస్తుంది. దీనికి కావాల్సింది ఫోటోతో వున్న వయసు నిర్ధారణ పత్రాలు.. వీటిని “S-1 counter” వద్ద చూపించాల్సి వుంటుంది. ఈ కౌంటర్ ఆలయానికి కుడివైపు బ్రిడ్జి కింద గోడ పక్కనే ఉంటుంది. మెట్లు ఎక్కాల్సిన పని లేదు. మంచి సీట్లు ఏర్పాటు చేయబడి వుంటాయి. దర్శనం కోసం వెళ్లిన వృద్ధులకు సాంబారన్నం, పెరుగన్నం, వేడి పాలు ఉచితంగా ఇస్తారు. అక్కడే వారికి రూ. 20/-లకు రెండు లడ్డు టోకెన్లు ఇస్తారు. తరువాత రూ. 25/- లకు ఒక లడ్డు చొప్పున ఎన్నైనా టోకెన్లు ఇస్తారు. కౌంటరు నుండి గుడికి-గుడి నుండి కౌంటరుకు బ్యాటరీ కారులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. అంతేకాదు వృద్ధులకు ఇచ్చిన దర్శన సమయంలో మిగతా అన్ని క్యూ లు నిలిపి వేయబడతాయి. దీంతో స్వామివారిని దర్శించుకోవడంలో ఎటువంటి వత్తిళ్ళు-తోపులాటలు వుండవు. అందుకనే సీనియర్ సిటిజన్స్ దర్శనం చాలా సంతోషంగా సౌకర్యంగా సేఫ్ గా 30 ని. పూర్తి అవుతుంది. అయితే ఈ దర్శనాన్ని వారంలో రెండు రోజులు మాత్రమే కల్పిస్తున్నారు. ప్రతి బుధవారం మరియు శుక్రవారం ఉదయం మాత్రమే దర్శనం ఉంటుంది.

Also Read:

కరోనా వైరస్ వ్యాక్సిన్ ను నిల్వ చేసుకునే సరికొత్త ఫ్రీజర్ లాంఛ్.. దీని స్పెషాలిటీస్ ఏమిటంటే

 ప్రాణం మీదకు తెచ్చిన తొందరపాటు.. నాలుగో అంతస్తు నుంచి కిందపడిన విద్యార్థులు