
దసరా పండుగను హిందూ మతంలో చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ పండుగ చెడుపై మంచి, అసత్యంపై సత్యం.. అధర్మంపై ధర్మం సాధించిన విజయాన్ని ప్రతీకగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం పదవ రోజున విజయ దశమిగా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీరాముడు రావణుడిని సంహరించి సీతాదేవిని తీసుకువచ్చాడని ఒక పురాణ కథనం. ఈ కారణంగా ఈ పండుగను రావణ దహనంగా కూడా జరుపుకుంటారు. అంతేకాదు మరోకథ ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడిని దుర్గాదేవి సంహరించింది. అందుకనే చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా దసరా వేడుకలను జరుపుకుంటారు.
దసరాను విజయదశమి అని కూడా అంటారు. 2025లో దసరా తేదీ గురించి ప్రజల్లో గందరగోళం ఉంది. దసరా ఖచ్చితమైన తేదీ, దానిని ఎప్పుడు జరుపుకోవాలో తెలుసుకుందాం.
దసరా పూజకు శుభ ముహూర్తం
దసరా రోజున రావణుడు, మేఘనాథుడు, కుంభకర్ణుడి దిష్టిబొమ్మలను వివిధ ప్రదేశాలలో సృష్టించి దహనం చేస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ఇది చిహ్నంగా పరిగణించబడుతుంది. రావణ దహనాన్ని వీక్షించడానికి ప్రజలు ఉత్సాహంగా ఎదురుచూస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు