హిందూ మతంలో దసరా పండుగ చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించినందున ఈ రోజును విజయ దశమి అని కూడా పిలుస్తారు. దసరా పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం పదవ రోజున జరుపుకుంటారు. అ ధర్మంపై , చెడుపై మంచి సాధించిన విజయంగా ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ ఏడాది విజయదశమి ఎప్పుడు వచ్చింది? రావణ దహన కార్యక్రమం ఎప్పుడు నిర్వహిస్తారు తెలుసుకుందాం..
హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఆశ్వయుజ మాసం దశమి తిథి అక్టోబర్ 12 ఉదయం 10:58 గంటలకు ప్రారంభమవుతుంది. మర్నాడు అంటే అక్టోబర్ 13 ఉదయం 9:08 వరకు కొనసాగుతుంది. ఉదయ తిథి ప్రకారం ఈ సంవత్సరం దసరా పండుగను అక్టోబర్ 12 శనివారం జరుపుకోనున్నారు.
హిందూ విశ్వాసాల ప్రకారం ప్రదోష కాలంలో రావణ దహనం జరుగుతుంది. పంచాంగం ప్రకారం అక్టోబర్ 12 న రావణ దహనం శుభ సమయం సాయంత్రం 5:53 నుంచి 7:27 వరకు ఉంటుంది.
దసరా రోజున మధ్యాహ్నం 2:03 నుంచి 2:49 గంటల వరకు శస్త్రపూజ లేదా ఆయుధ పూజను నిర్వహించే శుభ సమయం. దీని ప్రకారం ఈ సంవత్సరం ఆయుధ పూజకు 46 నిమిషాల సమయం లభిస్తుంది.
ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపద
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్
ఓం దశరథాయ విద్మహే సీతా వల్లభాయ ధీమహి
ఓం హ్రాం హ్రీం రామ రామాయ నమః
హిందూ మతంలో దసరాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజును అసత్యంపై సత్యం సాధించిన విజయంగా, అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. ఈ రోజున, కొత్త పనిని ప్రారంభించడం, వాహనం, ఆభరణాలు కొనుగోలు చేయడం వంటి శుభ కార్యాలు శుభప్రదంగా భావిస్తారు.