Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్.. రథసప్తమి వేళ ఆ దర్శనాలన్నీ రద్దు.. పూర్తి వివరాలివే..

తిరుమలలో రథసప్తమి వేడుకలకు టీటీడీ అధికారులు పకడ్బంధీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. రథసప్తమి వేడుకలకు తిరుమల మాడవీధులు ముస్తాబయ్యాయి. దాదాపు రెండు లక్షలకు పైగా భక్తులు హాజరుకానుండటంతో భద్రతా ఏర్పాట్లపై ఫోకస్ చేసింది టీటీడీ. ప్రివిలేజ్ దర్శనాలన్నింటినీ రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.

Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్.. రథసప్తమి వేళ ఆ దర్శనాలన్నీ రద్దు.. పూర్తి వివరాలివే..
Tirumala News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 03, 2025 | 5:12 PM

తిరుమలలో రథసప్తమి వేడుకలకు టీటీడీ అధికారులు పకడ్బంధీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. రథసప్తమి వేడుకలకు తిరుమల మాడవీధులు ముస్తాబయ్యాయి. దాదాపు రెండు లక్షలకు పైగా భక్తులు హాజరుకానుండటంతో భద్రతా ఏర్పాట్లపై ఫోకస్ చేసింది టీటీడీ. ప్రివిలేజ్ దర్శనాలన్నింటినీ రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఉదయం సూర్యప్రభ వాహనసేవతో వేడుకలు ప్రారంభమవుతాయి.. రాత్రి చంద్రప్రభ వాహనసేవతో వేడుకలు ముగుస్తాయి.. ఈ మేరకు మాడవీధుల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లుచేశారు. గ్యాలరీల్లో 2లక్షల మంది భక్తులకు అనుమతించనున్నారు. 130 గ్యాలరీల్లో ప్రత్యేక ఫుడ్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు. మంది భక్తులకు అనుమతించనున్నారు.

మంగళవారం ఉదయం 5.30కి సూర్యప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ప్రారంభమవుతాయి. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహన సేవ.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహన సేవ, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహన సేవ, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ, సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయి.

ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడు జన్మించిన మాఘ శుద్ధ సప్తమి రోజున రథ సప్తమి వేడుకలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతాయి. త్రిమూర్తి స్వరూపుడైన సూర్యభగవానుడిని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మకం.

మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం సిఫారసు లేఖలు అనుమతించబడవని.. కేవలం సర్వదర్శనం మాత్రమే ఉంటుందన్నారు ఈవో శ్యామలరావు.. రథసప్తమి సందర్భంగా అష్టాదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేసినట్టు ప్రకటించింది టీటీడీ..

ఎన్‌ఆర్‌ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేసింది. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. సుమారు రెండు లక్షల మంది భక్తులు హాజరుకానుండటంతో గత అనుభవాల దృష్ట్యా గ్యాలరీల్లో ఉండే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది పాలకమండలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..