Bats in Dreams: కలలో గబ్బిలాలు కనిపిస్తున్నాయా… జాగ్రత్త సుమా.. ఎంత అశుభమో తెలుసా..

కలలు నిద్రలో కనిపించే చిత్రాలు, అనుభూతులు, భావోద్వేగాలు, ఆలోచనల పరంపర. అయితే జ్యోతిషశాస్త్రం ప్రకారం కలలకు ఇతర అర్థాలు కూడా ఉన్నాయి. కలలు కనడం శుభప్రదం. అయితే కొన్నిసార్లు కలలు కూడా అశుభం కావచ్చు. చాలా సార్లు మనకు నిజ జీవితానికి పోలిక లేని కలలు వస్తాయి.

Bats in Dreams: కలలో గబ్బిలాలు కనిపిస్తున్నాయా... జాగ్రత్త సుమా.. ఎంత అశుభమో తెలుసా..
Bats In Dreams

Updated on: Mar 29, 2025 | 9:09 AM

నిద్రపోతున్నప్పుడు కలలు కనడం, నిలబడి ఉన్నప్పుడు పగటి కలలు కనడం అసాధారణం కాదు. ఎందుకంటే ప్రజలు కలలు కనడానికి ఇష్టపడతారు. కొన్నిసార్లు ఆ కలలు మంచివి కావచ్చు, కొన్నిసార్లు అవి చాలా చెడ్డవి కావచ్చు. కొన్ని కలలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. రోజంతా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎవరికైనా మంచి కల వచ్చినప్పుడు మనస్సు చాలా రిలాక్స్‌గా ఉంటుంది. అంటే ఎటువంటి కల వచ్చినా, ఉత్సుకత లేదా ప్రశ్నలు ఎల్లప్పుడూ మనస్సులో మెదులుతూ ఉంటాయి. కలలకు శాస్త్రీయ అర్థం గురించి చాలా మందికి తెలుసు. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం కలలకు ఇతర అర్థాలు కూడా అనేకం ఉన్నాయి. కలలు భవిష్యత్ లో జరగనున్న మంచి చెడులను తెలియజేస్తయని స్వప్న శాస్త్రం పేర్కొంది. కలలో గబ్బిలం కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం ఆ కల చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది.

కలల వివరణ అందరి జీవితాల్లో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. కలల ద్వారా భవిష్యత్ లో జరగనున్న సంఘటనల గురించి హెచ్చరించిక కావొచ్చు. ఉదాహరణకు ఎవరి కలలో నైనా గబ్బిలాలు కనిపించినట్లు అయితే వారు జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గబ్బిలాలను చూడటం అశుభంగా పరిగణించబడుతుంది. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో గబ్బిలం కనిపిస్తే మీకు ఎలాంటి అడ్డంకులు లేదా సమస్యలు ఎదురవుతాయో తెలుసుకోండి.. ముందుగా తగినంత జాగ్రత్తగా ఉండండి..

ఒక గబ్బిలం మీపై దాడి చేయడానికి వస్తున్నట్లు కలలు కన్నట్లయితే..ఆ కల అశుభానికి సంకేతం. ఇటువంటి కల కంటే మీరు ఏదో చెడు వ్యసనానికి బలి కాబోతున్నారని నమ్మకం. అదనంగా మీరు ఒకరి పట్ల లేదా దేని పట్లనైనా ప్రతికూల వైఖరిని పెంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

స్వప్న శాస్త్రం ప్రకారం.. కలలో గబ్బిలాలు కనిపించడం అంటే రానున్న భవిష్యత్తులో వివిధ ప్రమాదాలకు ముందస్తు సూచిన. కనుక ఇటువంటి కల వస్తే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి కల వస్తే కనుక భవిష్యత్ లో మీరు చాలా భయంతో గడుపుతారని కూడా సూచిస్తుంది. దీని వల్ల అనేక సమస్యలు వస్తాయి. కలలో గబ్బిలం కనిపిస్తే.. స్వప్న శాస్త్రం ప్రకారం ముందుగానే జాగ్రత్తగా ఉండాలి.

ఎవరి కలలోనైనా గబ్బిలాల గుంపును చూసినట్లయితే.. అది మీ దురదృష్టానికి సంకేతం. మీకు అదృష్టం ఎప్పటికీ అనుకూలంగా ఉండదని తెలియజేస్తుంది ఈ కల. కనుక కలలలో గబ్బిలాల గుంపుని చూడడం అస్సలు మంచిది కాదు. అంతే కాదు ఉద్యోగాలు, వ్యాపారంలో నష్టపోయే ప్రమాదం కూడా ఉండవచ్చు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు