గాఢ నిద్ర పోతూ సంతోషంగా కలలు కనే వారు చాలా మంది ఉంటారు. కొందరి కలలో డబ్బు సంపాదిస్తున్నట్లు వస్తే.. మరికొన్ని సార్లు భయంకరమైన కలలు కనిపిస్తాయి. పాములు, పక్షులు, ఫంక్షన్లు ఇలా రకరకాల కలలు కంటారు. అయితే ప్రతి ఒక్క కలకు స్వప్న శాస్త్రంలో భవిష్యత్ లో జరగనున్న విషయాలను ముందస్తుగా చూపిస్తున్నట్లు నమ్మకం. కలలు కనడం సహజమైన ప్రక్రియ. కనుక జీవితంలోని ప్రతి క్షణం కలలతో ముడిపడి ఉంటుంది. స్వప్న శాస్త్రం ప్రకారం కలలు జీవితంతో పాటు వివిధ సూచనలను కలిగి ఉంటాయి.
కలల శాస్త్రం ప్రకారం భవిష్యత్ లో జరగనున్న వివిధ సంఘటనల సంకేతాలను ఇలా కలల ద్వారా సుచిస్తాయని నమ్మకం. కొన్ని కలలు శుభప్రదమైనవి అయితే మరికొన్ని కలలు జీవితంలో రానున్న కష్టాలు, నష్టాలను సూచిస్తాయి. అయితే పురుషులు, మహిళలు వేర్వేరు రకాల కలలు కంటారు. బంగారు, వజ్రాభరణాలు మహిళలకు ఇష్టమైన వస్తువులలో ఒకటి. నగలు కొనడంతోపాటు నగలు ధరించడం కూడా ఇష్టం. కనుక స్త్రీల కలల్లో కొన్నిసార్లు కలలో వజ్రాలు, కెంపులన నగలు మెరుస్తూ కనిపించి మురిపిస్తాయి.
కలలో వజ్రాలు లేదా వజ్రాల ఆభరణాలు కనిపిస్తే
ఎవరైనా వివాహం కాని మహిళలు తన కలలో వజ్రాలు లేదా వజ్రాలు పొదిగిన ఆభరణాలను చూస్తే, ఉన్నత స్థాయి అధికారిని లేదా ధనిక వ్యాపారవేత్తతో వివాహం జరిగే అవకాశం ఉందని అర్థం.
కలలో పక్షులను చూడటం
ఒక స్త్రీ కలలో అందమైన పక్షిని చూసినట్లయితే.. ప్రేమ వివాహంగా మారడానికి ఎక్కువ కాలం పట్టదని అర్థం. కాబోయే జీవిత భాగస్వామి త్వరలో ధనవంతుడు కాబోతున్నాడని సూచన.
ఒక కలలో మంచం కనిపిస్తే
ఎవరైనా స్త్రీ మంచం మీద పడుకున్నట్లు కలగంటే ఆమె త్వరలో చాలా మంచి ప్రేమికుడిని లేదా భాగస్వామిని కలుసుకోనున్నదని అర్ధం. ఆ సంబంధం పెళ్లికి దారి తీస్తుంది.
కలలో కార్మికుడిని చూడటం
యుక్తవయస్సు లేదా యువతి కలలో పనులు చేసుకుంటున్న కార్మికుడు కనిపిస్తే.. ఆ యువతికి త్వరలో శివుడులా ప్రేమించే వరుడు లభిస్తాడని అర్థం. అతన్ని కలవవచ్చు లేదా డేట్ కు వెళ్ళే అవకాశం కూడా ఉంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు