Puja Vastu Tips: పూజగదిలో ఈ నియమాలను ఎట్టి పరిస్థితిలోనూ నిర్లక్ష్యం చేయకండి.. తేడా వస్తే సర్వం కోల్పోతారు..!

| Edited By: Janardhan Veluru

Mar 18, 2023 | 10:30 AM

సనాతన ధర్మంలో దేవుడిని క్రమం తప్పకుండా పూజించడానికి నియమాలు, నిబంధనలు ఉన్నాయి. భగవంతుడు నివసించని ఏ కణమూ ఈ ప్రపంచంలో ఉండదు.

Puja Vastu Tips:  పూజగదిలో ఈ నియమాలను ఎట్టి పరిస్థితిలోనూ నిర్లక్ష్యం చేయకండి.. తేడా వస్తే సర్వం కోల్పోతారు..!
Pooja Room
Follow us on

సనాతన ధర్మంలో దేవుడిని క్రమం తప్పకుండా పూజించడానికి నియమాలు, నిబంధనలు ఉన్నాయి. భగవంతుడు నివసించని ఏ కణమూ ఈ ప్రపంచంలో ఉండదు. వాటిని పూజించడం వల్ల మనిషి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సానుకూలత లభిస్తాయి. ప్రతి హిందువు తన ఇంట్లో దేవుడిని ఆరాధించడానికి ఒక పూజాగది ఉంటుంది. ఈ ప్రదేశం సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది. పూజా స్థలంలో మనం ఖచ్చితంగా నియమాలు పాటిస్తుంటాం. కానీ మనకు తెలిసి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటాం. ఇంట్లోని పూజగదిలో పాటించాల్సిన నియమాలు ఏంటి. కొన్ని నియమాలను నిర్లక్ష్యం వల్ల జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొవల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం.

1. పూజా స్థలంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి. స్నానం చేయకుండా పూజాగదిలోకి వెళ్లకూడదు.

2. ఉదయం, సాయంత్రం పూజాగదిలో తప్పనసరిగా దీపాలు వెలిగించాలి. అంతేకాదు ఇంట్లోని పూజగదిలో ఆరాధన సమయంలో గంట, శంఖం ఊదినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. శంఖం, గంట మోగించడం లక్ష్మీదేవికి ఇష్టమని వాస్తు చెబుతోంది.

ఇవి కూడా చదవండి

3. హిందూ మతంలో ముందుగా పూజించబడేది వినాయకుడిని. మీరు ఏదైనా శుభ కార్యం చేయడానికి వెళితే, ఖచ్చితంగా గణేశ నామాన్నిజపించాలి. అందుకే పూజా మందిరంలో గణేశుడి విగ్రహాన్ని తప్పనిసరిగా ఉంచాలి. ఇది సానుకూల శక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది.

4. పూజా గదిలో లక్ష్మీ దేవి విగ్రహానికి ఎడమ వైపున గణపతి విగ్రహాన్ని ఉంచాలి.కూర్చోని ఉన్న వినాయక విగ్రహాన్ని లేదా చిత్ర పటాన్ని ఇంట్లోని పూజగదిలో ఉంచాలి.

5. ప్రతిరోజూ దేవతలకు తాజా పువ్వులను పెట్టాలి. పాచిపోయిన, వాడిపోయిన పువ్వులను దేవులకు సమర్పించకూడదు. అలాగే ఇంట్లో వాడిపోయిన పువ్వులను ఉంచకూడదు. ఇది ప్రతికూలతను దారి తీస్తుంది.

6. మీ కుటుంబ దేవత లేదా దేవత విగ్రహాన్ని తప్పనిసరిగా పూజా స్థలంలో ఉంచాలి. నిత్యం పూజించాలి. అంతే కాకుండా పూజా స్థలంలో హనుమాన్ విగ్రహాన్ని తప్పనిసరిగా ఉంచాలి. హనుమాన్ అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి మంగళ, శనివారాల్లో హనుమాన్ చాలీసా తప్పకుండా పఠించాలి.

7. మీరు పూజా స్థలంలో శివలింగాన్ని ఉంచినట్లయితే, శివలింగం పరిమాణం చాలా పెద్దదిగా ఉండకూడదని గుర్తుంచుకోండి.

8. ఇంట్లో పూజా స్థలంలో చనిపోయిన వారి చిత్రాలను ఉంచకూడదు.. మీ పూర్వీకుల ఫోటోలు దక్షిణ దిశలో ఉంచాలి.

9.శాస్త్రాల ప్రకారం దేవతామూర్తుల విగ్రహాలను ఇంట్లో ఉంచకూడదు. శనిదేవుడు, కాళీమాత, భైరవబాబా విగ్రహాలను పొరపాటున కూడా ఇంట్లో ఉంచకూడదు.

10. మీరు ఇంట్లో దేవతా విగ్రహాలను ఉంచినట్లయితే, మీరు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)