Joshimath: జోషిమఠం బద్రీనాథ్‌కి ప్రవేశద్వారం.. ఇక్కడ రాత్రి ఎందుకు నిద్ర చేస్తారు.. మతపరమైన పాముఖ్యత ఏమిటో తెలుసా

|

Jan 10, 2023 | 4:25 PM

హిందూ మతంలో ఈ ఆధ్యాత్మిక నగరానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ధౌలిగంగ , అలకనంద సంగమం వద్ద ఉన్న జోషిమఠం చార్ ధామ్‌లలో ఒకటైన  బద్రీనాథ్ కు ప్రవేశద్వారం. చార్ ధామ్ యాత్ర ఇక్కడే పూర్తవుతుంది.

Joshimath: జోషిమఠం బద్రీనాథ్‌కి ప్రవేశద్వారం.. ఇక్కడ రాత్రి ఎందుకు నిద్ర చేస్తారు.. మతపరమైన పాముఖ్యత ఏమిటో తెలుసా
Joshimath
Follow us on

దేవ భూమిగా ఖ్యాతిగాంచిన ఉత్తరాఖండ్‌లోని  జోషిమఠంలోని పరిస్థితులు స్థానికులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలను  కలిగిస్తున్నాయి.  ఎందుకంటే.. జోషిమఠానికి హిందూ మతంలో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది. సనాతన సంప్రదాయం ప్రకారం.. జగద్గురువు ఆది శంకరాచార్యులు స్థాపించిన నాలుగు ప్రధాన మఠాలలో మొదటిదైన జ్యోతిర్మఠం ఇక్కడే ఉంది. జోషిమఠ్ జ్యోతిర్మఠంలోనే అంతర్భాగంగా పరిగణించబడుతుంది. కొంతమంది జ్యోతిర్పీఠాన్ని జ్యోతిష్పీఠం లేదా శ్రీమఠం అని కూడా పిలుస్తారు. సనాతన సంప్రదయాన్ని అనుసరిస్తూ..  వేదాంత-సిద్ధాంతం మొదలైన వాటి ప్రచారం కోసం జగద్గురువు ఆది శంకరాచార్యులు ఈ మఠాన్ని కార్తీక శుక్ల పంచమి, యుధిష్ఠిర సంవత్సరం 2646 నాడు స్థాపించారని నమ్ముతారు. శంకరాచార్యులు  ప్రధాన శిష్యుడైన తోటకాచార్యను జ్యోతిర్మఠానికి మొదటి శంకరాచార్యగా నియమింపబడ్డారు.

బద్రీనాథ్‌తో జోషిమఠానికి సంబంధం హిందూ మతంలో ఈ ఆధ్యాత్మిక నగరానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ధౌలిగంగ , అలకనంద సంగమం వద్ద ఉన్న జోషిమఠం చార్ ధామ్‌లలో ఒకటైన  బద్రీనాథ్ కు ప్రవేశద్వారం. చార్ ధామ్ యాత్ర ఇక్కడే పూర్తవుతుంది. బద్రీనాథ్ వెళ్లే యాత్రికుడు హరిద్వార్ నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించి.. ఈ జోషిమఠ్‌లో కనీసం ఒక రాత్రి గడపాలి. విశేషమేమిటంటే చలికాలంలో బద్రీనాథ్ దేవాలయం తలుపులు మూసేస్తే, బద్రీ విశాల్ విగ్రహాన్ని ఈ జోషిమఠానికి తీసుకొచ్చి ఆరు నెలల పాటు పూజిస్తారు. బద్రీనాథ్‌ని సత్యయుగంలో బదరికాశ్రమం అని, త్రేతాయుగంలో యోగసిద్ధి అని, ద్వాపరయుగంలో బద్రీ విశాల్ అని, కలియుగంలో బద్రీనాథ్ లేదా బద్రీనారాయణ అని పిలుస్తారు.

పంచ బద్రిల పరిస్థితి ఎలా ఉన్నదంటే.. జోషి మఠం సమీపంలో మొత్తం ఐదు బద్రీలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రధాన బద్రీనాథ్ ఆలయం. దీనిని బద్రీ విశాల్ అని పిలుస్తారు..  రెండవ బద్రీ జోషి మఠం నుండి 12 కి.మీ దూరంలో ఉన్న తపోవనం దాటి వెళ్ళిన తర్వాత కనిపిస్తుంది. ఇక్కడ స్వామిని  భవిష్య బద్రి అంటారు. మూడో బద్రి .. జోషి మఠం నుండి 5 కి.మీ దూరంలో ఉన్న ప్రాంతాన్ని వృద్ధ బద్రీ అని పిలుస్తారు. కర్ణప్రయాగ నుండి 16 కి.మీ దూరంలో ఉన్న ప్రాంతం నాల్గో బద్రి కాగా.. ఐదవ బద్రీ జోషిమఠం నుండి 20 కి.మీ దూరంలో ఉంది. మహాభారత కాలంలో పాండవుల తండ్రి అయిన పాండు రాజు పాండకేశ్వర్‌లో ధ్యానం చేశాడని భక్తుల విశ్వాసం

ఇవి కూడా చదవండి

ఆచార్య శంకార్యాచర్య ఆశీస్సులు.. ప్రకృతి ఒడిలో ఉన్న జ్యోతిర్మఠంలో  8వ శతాబ్దంలో ఆది గురువు శంకరాచార్య తపస్సు చేశారని.. ఇక్కడ తన తపస్సు బలంతో ధైవిక, అతీంద్రియ ఆధ్యాత్మిక కాంతిని వెలిగించాడని ఒక నమ్మకం. దీని వలన ఈ పుణ్యభూమికి వచ్చే యాత్రికులు,సాధకులు త్వరగా తమ కోరికలను నెరవేర్చుకుంటారని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)