Lakshmi Temple: దీపావళి రోజున డబ్బులతో లక్ష్మీదేవికి అలంకారం.. భక్తులకు ప్రసాదంగా నగదు పంపిణీ ఎక్కడో తెలుసా..

|

Oct 24, 2022 | 1:42 PM

దీపావళి పండుగ సందర్భంగా మారుమూల నగరాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇక్కడ 5 రోజులపాటు అఖండ జ్యోతి వెలుగుతుంది. భక్తులకు అమ్మవారి దగ్గర ఉంచిన డబ్బుని ప్రసాదం రూపంలో అందజేస్తారు

Lakshmi Temple: దీపావళి రోజున డబ్బులతో లక్ష్మీదేవికి అలంకారం.. భక్తులకు ప్రసాదంగా నగదు పంపిణీ ఎక్కడో తెలుసా..
Kanpur Lakshmi Temple
Follow us on

దీపావళి పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని అమావాస్య నాడు జరుపుకుంటారు. ఈ రోజున లక్ష్మీ దేవిని,  గణేశుడిని పూజిస్తారు. ఈ సమయంలో ఆలయాలకు ప్రత్యేక అలంకరణ చేస్తారు. ఈ క్రమంలో, కాన్పూర్‌లోని దీపావళి పండుగ సందర్భంగా పర్మత్ ఆలయ సముదాయంలో ఉన్న వైభవ లక్ష్మీ అమ్మవారి దర్బార్‌ను నోట్లతో అలంకరించారు. ఇక్కడి దర్శనం ద్వారానే భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం. అమ్మవారి అలంకారాన్ని చూసేందుకు భక్తుల అధిక సంఖ్యలో వస్తారు. ప్రతి సంవత్సరం ధన్‌తేరస్‌ సందర్భంగా లక్ష్మీదేవిని 5 లక్షల 51 వేల రూపాయల నోట్లతో అద్భుతంగా అలంకరించారు.

ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఆస్థానం భిన్నమైన రూపంలో దర్శనమిస్తుంది.  అక్కడ చిన్నా, పెద్దా నోట్లను అమ్మవారి  అలంకరణలో వినియోగిస్తారు. ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులకు అమ్మవారి ఆశీస్సులను తీసుకుంటారు. ఆలయ మహంత్ జితేంద్ర మోహన్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా అమ్మవారిని నోట్లతో అలంకరించడం ఆనవాయితీగా వస్తోందని, ఏడాది పొడవునా భక్తులు అమ్మవారి పాదాలకు నైవేద్యాలు సమర్పించి పూజలు చేస్తారని తెలిపారు. ధన్‌తేరస్ రోజున ఆలయ ప్రాంగణంలో నోట్లతో అమ్మవారిని అలంకరించడానికి వాటిని జమ చేస్తారు.

అమ్మవారి ఆశీర్వాదానికి ప్రత్యేక ప్రాముఖ్యత:
ఈసారి గ్రహణం కారణంగా నోట్ల సంఖ్య తగ్గింది కానీ అమ్మవారి మహిమ మాత్రం తగ్గలేదు. దీపావళి పండుగ సందర్భంగా మారుమూల నగరాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇక్కడ 5 రోజులపాటు అఖండ జ్యోతి వెలుగుతుంది. భక్తులకు అమ్మవారి దగ్గర ఉంచిన డబ్బుని ప్రసాదం రూపంలో అందజేస్తారు. ఈ నగదును ఇంట్లో ఉంచడం ద్వారా ఆనందం, శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం.ఈ అద్భుతమైన వైభవ లక్ష్మీ మాత ఆలయంలో దీపావళి పర్వదినం రోజున  ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాన్పూర్‌లోని వైభవ్ లక్ష్మీమాత ఆలయంలోని అద్భుతమైన దృశ్యం దేశంలో మరెక్కడా కనిపించదని.. ప్రతి ఏటా తాము వస్తున్నామని భక్తులు తెలిపారు. తల్లి ఆశీస్సులతో తమ , కుటుంబం, వ్యాపారంలో పురోగతి ఉంటుందని చెబుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)