Diwali 2024: ఈరోజు ఈ రాష్ట్రాల్లో నవంబర్ 1న దీపావళి పండగ, పూజకు 41 నిమిషాలు మాత్రమే అందుబాటులోకి

|

Nov 01, 2024 | 9:23 AM

దీపావళి పండుగ సందడి ఇంకా ముగియలేదు. కొన్ని రాష్ట్రాల్లో అక్టోబర్ 31 న దీపావళి జరుపుకున్నారు. మరి కొన్ని రాష్ట్రాల్లో ఈరోజు అంటే నవంబర్ 1న దీపావళి జరుపుకోనున్నారు. పూజకు 41 నిమిషాలు మాత్రమే అందుబాటులో ఉంది. అమావాస్య తిథి ముగింపుతో లక్ష్మీ పూజ ముగుస్తుంది.

Diwali 2024: ఈరోజు ఈ రాష్ట్రాల్లో నవంబర్ 1న దీపావళి పండగ, పూజకు 41 నిమిషాలు మాత్రమే అందుబాటులోకి
vastu tips
Follow us on

దీపాల పండుగ దీపావళిని దేశవ్యాప్తంగా అక్టోబర్ 31న అత్యంత వైభవంగా జరుపుకున్నారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఈరోజు నవంబర్ 1న దీపావళి జరుపుకుంటున్నారు. ఈ ఏడాది దీపావళి తేదీ విషయంలో దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. ఎందుకంటే ఆశ్వయుజ మాసంలోని అమావాస్య తిధి రోజున దీపావళిని జరుపుకునే సంప్రదాయం ఉంది. కొంతమంది అక్టోబర్ 31 న దీపావళి జరుపుకున్నారు. ఇప్పుడు దీపావళి పండగను కొన్ని రాష్ట్రాల్లో నవంబర్ 1 న జరుపుకోనున్నారు.

పంచాంగం ప్రకారం దీపావళి ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య తిధి అక్టోబర్ 31 మధ్యాహ్నం 3.22 గంటలకు ప్రారంభమై నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6.16 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో నవంబర్ 1 న లక్ష్మీ దేవి పూజకు శుభ సమయం సాయంత్రం 5:36 నుంచి 6:16 వరకు ప్రారంభమవుతుంది. ఈ సమయంలో భక్తులకు లక్ష్మీ దేవి పూజల కోసం మొత్తం 41 నిమిషాల సమయం ఉంది.

ఈ రాష్ట్రాల్లో నవంబర్ 1న దీపావళి జరుపుకోనున్నారు

ఇవి కూడా చదవండి

ఢిల్లీ, ముంబై, రాజస్థాన్ , ఉత్తరాఖండ్‌లలో ఈరోజు నవంబర్ 1న దీపావళి జరుపుకోనున్నారు. ఢిల్లీ, ముంబైలోని కొన్ని ప్రాంతాలలో దీపావళి ఇప్పటికే అక్టోబర్ 31న జరుపుకున్నారు. అక్టోబర్ 31న దీపావళి జరుపుకున్న రాష్ట్రాలు ఇప్పుడు గోవర్ధన్ పూజ కోసం ఎదురుచూస్తున్నాయి. నవంబర్ 1న దేశంలోని పెద్ద దేవాలయాల్లో దీపావళి జరుపుకోనున్నారు.

ఉత్తరాఖండ్, ముంబైలో ఈ రోజు దీపావళి

జ్యోతిష్యుల ప్రకారం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దీపావళి నవంబర్ 1 శుక్రవారం జరుపుకోనున్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగుల అధికారిక సెలవుదినం నగరంలో అక్టోబర్ 31 న మాత్రమే ఉంది. దీపావళి నవంబర్ 1 న జరుపుకుంటారు. ముంబైలో కూడా దీపావళికి సంబంధించి రెండు భిన్నమైన అభిప్రాయాలు ఏర్పడ్డాయి. అందువల్ల దీపావళిని ముంబైలోని కొన్ని ప్రాంతాలలో అక్టోబర్ 31 న జరుపుకున్నారు. మరి కొన్ని ప్రాంతాలలో ఈ రోజు నవంబర్ 1 న జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు.

హిందూ మత గ్రంధాల ప్రకారం ప్రదోష కాలంలో అమావాస్య ప్రాబల్యం రెండు రోజులు తక్కువగా లేదా ఎక్కువ ఉంటే అమావాస్య రెండవ రోజున లక్ష్మిని పూజించడం శుభంగా పరిగణించబడుతుంది. అమావాస్య , ప్రతిపాదాల సందర్భంగా ఈ రోజున లక్ష్మీ పూజ చేయడం సముచితమని భావిస్తున్నారు. అందుకే ఈ రాష్ట్రాల్లో నవంబర్ 1వ తేదీనే లక్ష్మీపూజ నిర్వహించనున్నారు. ఎందుకంటే ఇక్కడి ప్రజలు ఉదయతిథి ప్రకారం దీపావళికి లక్ష్మీదేవి పూజ చేస్తారు.

 

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

Note: పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.