Dev Uthani Ekadashi: దేవుత్తని ఏకాదశి ఎప్పుడు? తేదీ, పూజా విధానం, మంత్రం, ప్రాముఖ్యత మీ కోసం

తెలుగువారికి కార్తీక మాసం ఎంతో ప్రత్యేకమైనది. ఈ మాసం నెల రోజులు శివ కేశవుల పూజకు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణమి వంటి ఎన్నో పవిత్రమైన రోజులు ఉన్నాయి. అంతేకాదు కార్తీక మసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని దేవుత్తని ఏకాదశి అంటారు. ఈ రోజున శ్రీ మహా విష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ 12వ తేదీన మంగళ వారం రోజున దేవుత్తని ఏకాదశి వచ్చింది.

Dev Uthani Ekadashi: దేవుత్తని ఏకాదశి ఎప్పుడు? తేదీ, పూజా విధానం, మంత్రం, ప్రాముఖ్యత మీ కోసం
Dev Uthani Ekadashi 2024
Follow us
Surya Kala

|

Updated on: Nov 01, 2024 | 10:37 AM

హిందూ మతంలో ప్రతి ఏకాదశి తిధికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి తిథిని దేవుత్తని ఏకాదశిగా పరిగణించబడుతోంది. శ్రీ మహా విష్ణువు నాలుగు నెలల యోగ నిద్ర నుండి ఈ రోజున మేల్కొంటాడు. దీంతో చాతుర్మాస్ ముగుస్తుంది. శ్రీ మహా విష్ణు మళ్లీ విశ్వాన్ని నడిపించే బాధ్యతను స్వీకరిస్తాడు. వివాహం, నిశ్చితార్థం, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. ఈ రోజు నుంచి శుభ కార్యాలకు శుభ ముహూర్తాలు పాటిస్తారు.

దేవుత్తని ఏకాదశి తేదీ ఎప్పుడంటే

వేద క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం కార్తీక మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి 11 నవంబర్ 2024 సాయంత్రం 6.46 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి నవంబర్ 12, 2024 సాయంత్రం 4:04 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం దేవుత్తని ఏకాదశి ఉపవాసం నవంబర్ 12వ తేదీ మంగళవారం రోజున ఆచరిస్తారు.

ఇవి కూడా చదవండి

దేవుత్తని ఏకాదశి పూజ విధి

దేవుత్తని ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, ధ్యానం చేసి, విష్ణువు కోసం ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయండి. ఆ తర్వాత పూజా గదిని శుభ్రం చేసి శ్రీ మహా విష్ణుమూర్తిని, సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవిని స్మరించండి. అప్పుడు పంచామృతంతో స్వామికి స్నానం చేయించి, పసుపు లేదా చందనంతో తిలకం దిద్దండి. ఆ తర్వాత పసుపు పువ్వులు, తీపి పదార్థాలు, పండ్లు, తులసి దళాల మాలను విష్ణువుకు సమర్పించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా విష్ణువుకి సంబంధించిన మరేదైనా మంత్రాన్ని జపించండి. శ్రీ విష్ణు సహస్త్రాణం పఠించండి. అనంతరం హారతి ఇవ్వండి. రోజంతా ఉపవాసం ఉన్న తర్వాత రాత్రి సమయంలో మేల్కొని విష్ణువుని ప్రార్ధిస్తూ భజనలు, కీర్తనలు పఠిస్తూ ఉండండి. మర్నాడు ఉదయం పూజ తర్వాత, పారణ సమయంలో ఉపవాసం విరమించండి.

దేవుత్తని ఏకాదశి రోజున జపించాల్సిన విష్ణు మంత్రం

వందే విష్ణు భవ భయ హరం సర్వలోకైక నాథమ్ ఓం శ్రీ విష్ణువే చ విద్మహే వాసుదేవాయ ధీమహి. తన్నో విష్ణుః ప్రచోదయాత్ ఓం నమో నారాయణ ఓం నమో: భగవతే వాసుదేవాయ మంగళం విష్ణు, మంగళం గరుడధ్వజ

దేవుత్తని ఏకాదశిప్రాముఖ్యత

దేవుత్తని ఏకాదశితో అన్ని శుభ కార్యాలు ప్రారంభమవుతాయి. ఈ రోజున తులసి మొక్కకు శాలిగ్రామంతో వివాహం జరిపిస్తారు. ఈ రోజున తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున తులసి, శాలిగ్రామాన్ని పూజించడం వల్ల పితృదోషం తొలగిపోతుంది. ఈ రోజు ఉపవాసం ఉన్నవారి జాతకంలో చంద్రుని స్థానం బలంగా మారుతుంది.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

Note: పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.