Diwali 2022: దీపావళి రోజున లక్ష్మి,గణపతులను ఇలా పూజించండి.. అమ్మ ఆశీస్సులతో సంపదకు లోటుండదని నమ్మకం..

దీపావళి రోజు రాత్రి ఐశ్వర్యానికి అధిదేవతైన లక్ష్మీదేవి తన ఇంటికి వచ్చి తన పూర్ణ ఆశీస్సులు కురిపించాలని అందరి కోరిక. దీపావళి రోజు రాత్రి సంపద దేవత లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఆ కుటుంబం మీద ఉంటుందని నమ్మకం. 

Diwali 2022: దీపావళి రోజున లక్ష్మి,గణపతులను ఇలా పూజించండి.. అమ్మ ఆశీస్సులతో సంపదకు లోటుండదని నమ్మకం..
Deepavali Puja 2022
Follow us

|

Updated on: Oct 16, 2022 | 8:12 PM

సనాతన సంప్రదాయంలో కార్తీక మాసంలోని అమావాస్య రోజున సుఖ సంపదలను ఇచ్చే గణేశుడిని , సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవిని పూజించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీపావళి రోజున ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని, రాత్రి పగలు తేడా లేకుండా ఇంట్లో సంపద రెట్టింపు అవుతుందని నమ్మకం. ఇలాంటి పరిస్థితుల్లో దీపావళి రోజు రాత్రి ఐశ్వర్యానికి అధిదేవతైన లక్ష్మీదేవి తన ఇంటికి వచ్చి తన పూర్ణ ఆశీస్సులు కురిపించాలని అందరి కోరిక. దీపావళి రోజు రాత్రి సంపద దేవత లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఆ కుటుంబం మీద ఉంటుందని నమ్మకం.

దీపావళి రోజున లక్ష్మీదేవి పూజ విధానం:

  1. దీపావళి రోజున లక్ష్మీ దేవిని పూజించడానికి ముందు ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోండి. ఎందుకంటే పరిశుభ్రత ఉన్న చోట సంపద చిహ్నం అయిన లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు.
  2. లక్ష్మీ దేవిని పూజించడానికి.. ఈశాన్య దిశను ఎంచుకోవాలి. పూజించే స్థలాన్నీ శుభ్రం చేసి.. గంగా జలంతో శుద్ధిచేయాలి.
  3. ఇవి కూడా చదవండి
  4. గణేష్-లక్ష్మిదేవిని పూజించాలనుకునే ప్రదేశంలో.. ముందుగా ఒక పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరచి, దానిపై నవగ్రహాలను ఏర్పాటు చేయండి.. అనంతరం లక్ష్మీగణపతులను స్థాపించండి.
  5. లక్ష్మి ఆశీర్వాదం పొందడానికి.. గణపతిని ఎందుకు పూజించాలంటే.. వినాయకుడి నుండి ఆశీర్వాదం లేకుండా ఏ పని పూజ ఫలితాన్ని ఇవ్వదు. కనుక లక్ష్మీదేవి పూజకు ముందు గణేష్ ను పూజిస్తారు. మనిషి సంపద, శ్రేయస్సు కోసం డబ్బు ముఖ్యమని నమ్మకం. ఆర్ధికంగా బలంగా ఉన్నప్పుడే.. ఇల్లు, ప్రపంచం అభివృద్ధి చెందుతాయి.
  6. ఈశాన్య మూలలో సంపద దేవత లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రాన్ని ఏర్పాటు చేయండి. అయితే పూజ చేసేటప్పుడు మీ ముఖాన్ని తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్యం వైపు ఉంచండి.
  7. దీపావళి రాత్రి గణేష్-లక్ష్మితో పాటు శ్రీ హరి విష్ణువును పూజించాలి. శ్రీ మహావిష్ణువు ఎక్కడ పూజింపబడతాడో అక్కడ సంపదల దేవత అయిన లక్ష్మీదేవిని కొలువుంటుందని విశ్వాసం.
  8. ఎంతో కష్టపడి, శ్రమించినా ఆర్ధికంగా ఇబ్బందులు పడుతుంటే.. దీపావళి రోజు రాత్రి, సంపదల దేవత అనుగ్రహాన్ని కురిపించే శ్రీ యంత్రాన్ని పూజించడం మరువకండి. శ్రీ యంత్రాన్ని పూజించే ఇంట్లో, లక్ష్మీ దేవి నివాసం ఎల్లప్పుడూ ఉంటుందని నమ్ముతారు.
  9. దీపావళి రోజున ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీ దేవి పూజలో ఆమెకు ఇష్టమైన ఆవుపాలు, కొబ్బరికాయ, గోమతి చక్రం, నాగకేసర, తామరపువ్వు మొదలైన వాటిని తప్పనిసరిగా సమర్పించాలి. లక్ష్మీదేవిని ఈ విధంగా పూజిస్తే.. సంపద  దేవత  అనుగ్రహం సదా ఆ కుటుంబం పై ఉంటుందని.. విశ్వాసం.
  10. మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు