Dhanteras 2022: సంపదను ఆరోగ్యాన్ని ఇచ్చే ధన్‌తేరాస్ రోజున పాటించాల్సిన చర్యలు, పూజా నియమాలు మీకోసం

|

Oct 15, 2022 | 9:54 AM

ధన్ తేరాస్ రోజున చేసే పూజల కోసం కొన్ని చర్యలు, నియమాలు ఇవ్వబడ్డాయి. ఇలా చేయడం వలన వ్యక్తి జీవితాంతం ధన, ధాన్యాలతో జీవిస్తాడని నమ్మకం. ధన్ తేరాస్ రోజున చేసే పూజతో పాటు పాటించాల్సిన కొన్ని చర్యలు, నియమాల గురించి వివరంగా తెలుసుకుందాం.

Dhanteras 2022: సంపదను ఆరోగ్యాన్ని ఇచ్చే ధన్‌తేరాస్ రోజున పాటించాల్సిన చర్యలు, పూజా నియమాలు మీకోసం
Dhanteras 2022
Follow us on

హిందూమతంలో.. దీపావళి పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని ఐదురోజుల పాటు జరుపుకుంటారు.  దీపావళి త్రయోదశితో ప్రారంభమవుతుంది. అంటే కార్తీక మాసం కృష్ణ పక్షం మొదటి రోజు ధన్ తేరాస్.. ఈ సంవత్సరం అక్టోబర్ 23 న జరుపుకుంటారు. ధన్ తేరాస్ మహాపర్వ దినం రోజున లక్ష్మీ దేవిని ఆరాధిస్తారు. అంతేకాదు సంపదకు దేవుడు అయిన కుబేరునితో పాటు.. ఆరోగ్యానికి అధిపతి అయిన ధన్వంతరిని ప్రత్యేకంగా పూజిస్తారు. సనాతన సంప్రదాయంలో ఈ రోజున బంగారం, వెండి వస్తువులు, పాత్రలు, కొత్త వాహనం కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ధన్ తేరాస్ రోజున చేసే పూజల కోసం కొన్ని చర్యలు, నియమాలు ఇవ్వబడ్డాయి. ఇలా చేయడం వలన వ్యక్తి జీవితాంతం ధన, ధాన్యాలతో జీవిస్తాడని నమ్మకం. ధన్ తేరాస్ రోజున చేసే పూజతో పాటు పాటించాల్సిన కొన్ని చర్యలు, నియమాల గురించి వివరంగా తెలుసుకుందాం.

అదృష్టం తెచ్చే చీపురు 
ధన్ తేరాస్ రోజున ఇంట్లో కొన్ని వస్తువులు కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున మీరు అన్ని కొత్త వస్తువులతో కూడిన చీపురును కొనుగోలు చేస్తే.. అది ఇంట్లోని పేదరికం, ప్రతికూలతను తొలగిస్తుందని నమ్ముతారు.

వస్త్ర దానం గొప్పది
హిందూ మతంలో  తీజ్-పండుగలో ఆరాధనతో పాటు, దాతృత్వానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అటువంటి పరిస్థితిలో ధన్ తేరాస్ రోజున శుభం కోసం కొత్త వస్తువులను కొనుగోలు చేయడంతో పాటు, ఆహారం, బట్టలు మొదలైనవి దానం చేయండి. ధన్‌తేరస్ రోజున పేదవారికి బట్టలను దానం చేయడం గొప్ప దానంగా పరిగణించబడుతుంది. వస్త్రాలను దానం చేయడం వల్ల సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుందని నమ్మకం. లక్ష్మీదేవి కటాక్షంతో ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు.

ఇవి కూడా చదవండి

ఇనుము కొనుగోలు చేయకండి:
జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, ధన్‌తేరస్ రోజున కొన్ని వస్తువులను కొనడం మానుకోవాలి, లేకుంటే శుభ ఫలితాలకు బదులుగా అశుభ ఫలితాలు లభిస్తాయి. ధన్‌తేరస్‌లో గాజులు, సిరామిక్‌, ఇనుప పాత్రలు కొనకూడదని నమ్ముతారు.

అప్పు తీసుకోవద్దు:
ధన్‌తేరస్ రోజున డబ్బుల లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరి దగ్గరా అప్పు తీసుకోవద్దని.. డబ్బు ఇవ్వకూడదని నమ్ముతారు. అలాగని మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాలనుకున్నా.. తీసుకోవాలనుకున్నా.. అది ముందుగా చేయాలి. ధన్‌తేరస్‌లో డబ్బు లావాదేవీల కారణంగా లక్ష్మీదేవి కోపానికి గురవుతుందని నమ్మకం. దీనివల్ల వ్యక్తి ఆర్థికాభివృద్ధి ఆగిపోయి అతని వద్ద డబ్బు ఉండదు.

ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన చర్యలు:
ధన్వంతరి భగవానుడు ధన్ తేరాస్ రోజున జన్మించాడని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో, ఈ రోజున ఆయన ఆశీర్వాదం పొందడానికి, ఆయనను ప్రత్యేకంగా పూజించండి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద దక్షిణ దిశలో పిండితో నాలుగు ముఖాల దీపం తయారు చేసి వెలిగిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)