Karthika Somavaaram: వైభవంగా కార్తీక చివరి సోమవారం.. శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ.. శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు

|

Nov 21, 2022 | 6:45 AM

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శివా క్షేత్రం శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. పాతాళగంగలో భక్తులు భక్తిశ్రద్ధలతో కార్తీక పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు. కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు.

Karthika Somavaaram: వైభవంగా కార్తీక చివరి సోమవారం.. శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ.. శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు
Karthika Somvaram
Follow us on

నేడు కార్తీకమాసం చివరి సోమవారం. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. తెల్లవారు జామునుంచే ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. గోదావరి, కృష్ణా నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలోని భక్తులు శివా క్షేత్రాలతో పాటు ప్రముఖ ఆలయాల్లో తెల్లవారుజాము నుంచి అభిషేకాలు, ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శివా క్షేత్రం శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. పాతాళగంగలో భక్తులు భక్తిశ్రద్ధలతో కార్తీక పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు. కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం వేకువజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీ కారణంగా అధికారులు స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనాలు రద్దు చేశారు. భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం కల్పిస్తున్నారు.  పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామం, కుమారారామం,  క్షీరారామం, భీమారామం, అమరారామం దేవాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. త్రిపురాంతకం, బైరవకోన, శ్రీకాళహస్తి, కపిలతీర్థం వంటి పుణ్యక్షేత్రాల్లో భక్తుల ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి

మరోవైపు తెలంగాలోని ప్రముఖ క్షేత్రాల్లో కూడా భక్తుల రద్దీ నెలకొంది. యాదగిరి గుట్టకు భక్తులు పోటెత్తారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి,  వేములవాడ రాజరాజేశ్వర స్వామి తదితర ఆలయాల్లో కార్తీక సోమవారం రద్దీ కొనసాగుతోంది. భక్తులు నది స్నానమాచరించి కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..