
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్చుతాపురంలో కోటి తలంబ్రాల మహా యజ్ఞానికి వానరసేన శ్రీకారం చుట్టారు. దివి నుంచి భూమికి వానరసేన దిగివచ్చినట్లుగా జాంబవంతుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, శ్రీరాముడు, అంగధుడు వేషధారణతో దుక్కి దున్ని నాగలి పట్టి వరి విత్తనాలను నాటారు. ప్రతి ఏటా జూలై నెలలో వర్షాలు మొదలుకొని సమయంలో రాములోరి కళ్యాణానికి కోటి తలంబ్రాలు పంట కోసం గోకవరం మండలం అచ్చుతాపురంలోని ఉన్నా ఎకరం 60 సెంట్లలలో వానర వేషధారణలో వరి నాట్లు వేయడం ఆనవాయితీ.
కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్యం సంఘం సభ్యులు కళ్యాణ అప్పారావు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఏవిధమైన రసాయాణాలు పిచికారీ చేయకుండా వానర వేషధారణ తోనే వరి విత్తనాలు జల్లీ, ఊడ్పు ఊడ్చి, పంట కోత కోసి, ధాన్యాన్ని తలంబ్రాలుగా మలిచే వరకు వానర వేషధారణ తోనే గత 15 ఏళ్లుగా కోటి తలంబ్రాల కార్యక్రమం చేస్తున్నారు. చివరి దశలో వరి ధాన్యాన్ని సేకరించి గోటితో ఒలిచి కోటి తలంబ్రాలుగా మలిచి అయోధ్య, ఒంటిమిట్ట, భద్రాచలం శ్రీరాముని కళ్యాణానికి పంపిస్తారు.. ఇలా కోటి తలంబ్రాల పంటకు వానర సేన నుంచి రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న మహిళలు ఈ ధాన్యాన్ని గోటి కోటితో శ్రీరామ తత్వంలో వలిచి కోటి తలంబ్రాలకు శ్రీకారాన్ని చుడతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..