Yadadri: భక్తజనసంద్రంగా యాదాద్రి.. వరస సెలవులతో పెరిగిన రద్దీ.. అయినప్పటికీ
వరస సెలవులు, ఉగాది పర్వదినం కావడంతో యాదాద్రి(yadadri) భక్తజనసంద్రమైంది. యాదాద్రీశుడి నిజరూప దర్శనం చేసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. క్యూలైన్లు....
వరస సెలవులు, ఉగాది పర్వదినం కావడంతో యాదాద్రి(yadadri) భక్తజనసంద్రమైంది. యాదాద్రీశుడి నిజరూప దర్శనం చేసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. క్యూలైన్లు, సముదాయాలు నిండిపోయాయి. ఎండ(Temperature) అధికంగా ఉండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనీస సదుపాయాలు లేకపోవడంతో అవస్థలు ఎదుర్కొన్నారు. దర్శనానికి(Visiting) గంటలకొద్దీ లైన్లలో నిల్చోలేక భక్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకదశలో కనిపించిన ఏఈవోలు, పర్యవేక్షకులపై సదుపాయాలు లేనప్పుడు దర్శనాలు ఎందుకు కల్పించారంటూ ప్రశ్నించారు. భక్తుల తాకిడికి ప్రసాదాల విభాగంలో జాలి ఊడిపడింది. ఉగాది పర్వదినం సందర్బంగా ఆలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ప్రధానాలయంలో శనివారం నిత్యారాధనలు జరిగాయి. నిజాభిషేకం, అర్చన, అష్టోత్తర పర్వాలను ఆలయ ఆచారంగా కొనసాగించారు. రథశాల ఎదుట పంచాంగ శ్రవణం నిర్వహించారు.
మహాదివ్యక్షేత్రంలో స్వయంభూ మూర్తుల దర్శనాలు పునఃప్రారంభమవడంతో భక్తుల రద్దీ పెరగనుంది. దీనికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించేందుకు టీఎస్ఆర్టీసీ సమాయత్తమైంది. యాదగిరిగుట్టకు 100 మినీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి జిల్లా కేంద్రం నుంచి గుట్టకు ఈ బస్సులు నడవనున్నాయి. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ సర్కిల్ నుంచి యాదగిరిగుట్టకు మినీ బస్సులు అందుబాటులో ఉంటాయని టీఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి మూలవిరాట్ దర్శనాలు పునఃప్రారంభం కావడంతో భక్తుల కోసం యాదాద్రి దర్శిని పేరుతో ఆర్టీసీ మినీ బస్సులను ఏర్పాటు చేశారు. యాదగిరిగుట్టకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సుల ఛార్జీలనూ ఆర్టీసీ వెల్లడించింది. జేబీఎస్ నుంచి 100 రూపాయలు, ఉప్పల్ నుండి 75 రూపాయలుగా ఛార్జీగా నిర్ణయించారు.
Also Read
Social Media: మరో కీలక నిర్ణయం తీసుకున్న ఆ దేశ ప్రభుత్వం.. సామాజిక మాధ్యమాలపై నిషేధం
SCR: రికార్డు సృష్టించిన దక్షిణ మధ్య రైల్వే.. ప్రధాన మార్గాల్లో విద్యుదీకరణ పనులు పూర్తి