సింహాచలం అప్పన్న ఆలయంలో అపచారం.. అంతరాలయాన్ని వీడియో తీసిన భక్తుడు..
విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం అప్పన్న ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. అప్పన్న ఆలయంలోని స్వామి అంతరాలయాన్ని
విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం అప్పన్న ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. అప్పన్న ఆలయంలోని స్వామి అంతరాలయాన్ని ఓ భక్తుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అప్పన్న నిజ రూప దర్శనానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది.. గర్భాలయంలోని అప్పన్న నిజరూప విగ్రహం సామాజిక మాధ్యమాల్లో దర్శనం ఇవ్వడంతో భక్తులు షాకయ్యారు.. స్వామివారి నిజరూప దర్శనం ఇలా బహిరంగ పరచడం అపచారం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల భద్రత లోపాలపై మండిపడుతున్నారు. ఏ ఉద్దేశ్యంతో స్వామి నిజ రూప విగ్రహాన్ని సదరు ఆకతాయి తీసాడో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
వాస్తవానికి అప్పన్న ఆలయంలోకి సెల్ఫోన్లో వాడకం నిషేదం.. భక్తులు ఆలయంలోకి ఫోన్లను తీసుకురావడానికి అనుమతి లేదు.. కానీ భద్రత అధికారులకు తెలియకుండా ఆ ఆకతాయి వీడియో తీయడం భద్రత లోపమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింహాచలం అప్పన్న ఆలయంలో మంగళవారం చందనోత్సవం జరిగింది. స్వామి వారి నిజరూప దర్శనానికి భారీగా తరలివచ్చారు భక్తులు. సింహాచలంలోని ఆలయం భక్తజన సంద్రంగా మారింది. ఉదయం నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు..
Also Read: Keerthy Suresh: మహేష్ బాబును మూడు సార్లు కొట్టాను.. ఆసక్తికర కామెంట్స్ చేసిన కీర్తి సురేష్..
Megastar Chiranjeevi: పాండమిక్ తర్వాత తొలిసారి చిరంజీవి అలా.. చాలాకాలం తర్వాత సతీమణితో చిరు సెల్ఫీ..
God Father: సల్మాన్‌తో చిరు మాస్ బీట్.. ఇండియన్ మైకెల్ జాక్సన్ కొరియోగ్రఫీలో..